Manasijasamudra mada(tha?)namide

మనసిజసముద్ర మద(థ?)నమిదె
Language

(॥పల్లవి॥)
మనసిజసముద్ర మద(థ?)నమిదె
కనుగొను మింతటఁ గాంతుఁడ నీవు

(॥మన॥)
సతి చింతామతిజలనిధి తరువఁగ
అతిగరళపువిరహము వొడమె
తతి నాపిమ్మటఁ దమకపుఁగోర్కుల-
లతల కల్పకపులాకలు వొడమె

(॥మన॥)
పొలఁతికూరిములఁ బొంగులు వొంగఁగ
పులకల తారలు వొడమె నవె
ఫలమై సాత్త్వికభావపుఁజంద్రుఁడు
నిలువునఁ బొడమఁగ నేరుపు లలరె

(॥మన॥)
సుదతి దానే నీచొక్కపుఁగాగిట-
నదనున నిందిరమై పొడమె
కదిసిన శ్రీవేంకటపతి నీదెస
యదరామృత మయ్యతివకుఁ బొడమె

(||pallavi||)
manasijasamudra mada(tha?)namidĕ
kanugŏnu miṁtaḍam̐ gāṁtum̐ḍa nīvu

(||mana||)
sadi siṁtāmadijalanidhi taruvam̐ga
adigaraḽabuvirahamu vŏḍamĕ
tadi nābimmaḍam̐ damagabum̐gorgula-
ladala kalbagabulāgalu vŏḍamĕ

(||mana||)
pŏlam̐tigūrimulam̐ bŏṁgulu vŏṁgam̐ga
pulagala tāralu vŏḍamĕ navĕ
phalamai sāttvigabhāvabum̐jaṁdrum̐ḍu
niluvunam̐ bŏḍamam̐ga nerubu lalarĕ

(||mana||)
sudadi dāne nīsŏkkabum̐gāgiḍa-
nadanuna niṁdiramai pŏḍamĕ
kadisina śhrīveṁkaḍabadi nīdĕsa
yadarāmṛta mayyadivagum̐ bŏḍamĕ