మనసిజ గురుఁడితఁడో మరియుఁ గలఁడో వేద
(॥పల్లవి॥)
మనసిజ గురుఁడితఁడో మరియుఁ గలఁడో వేద-
వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడో
(॥మన॥)
అందరికి నితఁడెపో అంతరాత్ముఁడనుచు-
నందు రితఁడో మఱియు నవల నొకఁడో
నందకధరుఁడు జగన్నాథుఁడచ్చుఁతుడు గో-
విందుఁ డీతఁడుగాక వేరొకఁడు గలఁడో
(॥మన॥)
తనర నిందరికిఁ జైతన్యమొసఁగిన యాతఁ-
డొనర నితఁడో మఱియు నొకఁడు గలఁడో
దినకరశతతేజుఁడగు దేవదేవుడు, త-
ద్వినుతుఁ డితఁడుగాక వేఱొకఁడు గలఁడో
(॥మన॥)
పంకజభవాదులకుఁ బరదైవ మీతఁడని
అంకింతురితఁడో అధికుఁడొకఁడో
శాంకరీస్తోత్రములు సతతమునుఁ గైకొనెడి-
వేంకటవిభుఁడో కాక వేరొకఁడు గలఁడో
(||pallavi||)
manasija gurum̐ḍidam̐ḍo mariyum̐ galam̐ḍo veda-
vinudum̐ ḍīdam̐ḍu gāga verŏgam̐ḍu galam̐ḍo
(||mana||)
aṁdarigi nidam̐ḍĕbo aṁtarātmum̐ḍanusu-
naṁdu ridam̐ḍo maṟiyu navala nŏgam̐ḍo
naṁdagadharum̐ḍu jagannāthum̐ḍachchum̐tuḍu go-
viṁdum̐ ḍīdam̐ḍugāga verŏgam̐ḍu galam̐ḍo
(||mana||)
tanara niṁdarigim̐ jaidanyamŏsam̐gina yādam̐-
ḍŏnara nidam̐ḍo maṟiyu nŏgam̐ḍu galam̐ḍo
dinagaraśhadadejum̐ḍagu devadevuḍu, ta-
dvinudum̐ ḍidam̐ḍugāga veṟŏgam̐ḍu galam̐ḍo
(||mana||)
paṁkajabhavādulagum̐ baradaiva mīdam̐ḍani
aṁkiṁturidam̐ḍo adhigum̐ḍŏgam̐ḍo
śhāṁkarīstotramulu sadatamunum̐ gaigŏnĕḍi-
veṁkaḍavibhum̐ḍo kāga verŏgam̐ḍu galam̐ḍo