మనసిచ్చి యాతనితో మాటాడరాదా
(॥పల్లవి॥)
మనసిచ్చి యాతనితో మాటాడరాదా
యెనసినమీఁదట యెరవులు గలవా
(॥మన॥)
చెప్పరాని ప్రియములు సేయరానిబాసలు
అప్పుడే వింటివి గదే యతనిచేత
కొప్పుమీఁది సేనలు గోరికొనగురుతులు
ఇప్పుడే నింపించుకొంటి విఁకనేలే సుద్దులు
(॥మన॥)
పెట్టరానిఆనలు పెనఁగరానిచేఁతలు
గట్టిగాఁ గంటివిగదే కాంతునివల్ల
చుట్టరికపుఁదనాలు చూపులలో నవ్వులు
గుట్టునఁ జేకొంటివి కొంకనేలే నీకును
(॥మన॥)
తలఁచదానిపొందులు తనియరానిరతులు
కలిగెఁగదే విభునికాఁగిట నేఁడు
అలమేల్మంగను నేను అతఁడు శ్రీవేంకటేశుఁ-
డెలమి నన్నేలినాఁడు ఇయ్యకొనవెలనే
(||pallavi||)
manasichchi yādanido māḍāḍarādā
yĕnasinamīm̐daḍa yĕravulu galavā
(||mana||)
sĕpparāni priyamulu seyarānibāsalu
appuḍe viṁṭivi gade yadaniseda
kŏppumīm̐di senalu gorigŏnagurudulu
ippuḍe niṁpiṁchugŏṁṭi vim̐kanele suddulu
(||mana||)
pĕṭṭarāniānalu pĕnam̐garānisem̐talu
gaṭṭigām̐ gaṁṭivigade kāṁtunivalla
suṭṭarigabum̐danālu sūbulalo navvulu
guṭṭunam̐ jegŏṁṭivi kŏṁkanele nīgunu
(||mana||)
talam̐sadānibŏṁdulu taniyarāniradulu
kaligĕm̐gade vibhunigām̐giḍa nem̐ḍu
alamelmaṁganu nenu adam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍĕlami nannelinām̐ḍu iyyagŏnavĕlane