మనకు మనసే మరి తారుకాణ గాక
(॥పల్లవి॥)
మనకు మనసే మరి తారుకాణ గాక
వెనకకు ముందరికి విచారములేలా
(॥మన॥)
కన్నులనీచూపులే కంకణదారములాయ
పన్ని నన్ను వేరే వొడఁబరచనేల
చన్నులనావొత్తులే సరి నీకు ముద్రలాయ
విన్నపాలు మరి సేసేవిధమేల
(॥మన॥)
సెలవులనవ్వులే సేసపాలై అబ్బె నాకు
వెలిమొన సారె నన్ను వేఁడుకోనేల
యెలమి నాశావలే నీకెదురువుంకువలాయ
కులికి నే నిన్ను వేరె కొసరనేల
(॥మన॥)
కందువనీమోని నాకు కై కొన్నబువ్వములాయ
విందువలె చెక్కునొక్క వేరెయేల
అందముగ శ్రీవేంకటాధిప కూడితి నిన్ను
మందలించి యిఁక నీతో మట్టుమీరనేల
(||pallavi||)
managu manase mari tārugāṇa gāga
vĕnagagu muṁdarigi visāramulelā
(||mana||)
kannulanīsūbule kaṁkaṇadāramulāya
panni nannu vere vŏḍam̐barasanela
sannulanāvŏttule sari nīgu mudralāya
vinnabālu mari sesevidhamela
(||mana||)
sĕlavulanavvule sesabālai abbĕ nāgu
vĕlimŏna sārĕ nannu vem̐ḍugonela
yĕlami nāśhāvale nīgĕduruvuṁkuvalāya
kuligi ne ninnu verĕ kŏsaranela
(||mana||)
kaṁduvanīmoni nāgu kai kŏnnabuvvamulāya
viṁduvalĕ sĕkkunŏkka verĕyela
aṁdamuga śhrīveṁkaḍādhiba kūḍidi ninnu
maṁdaliṁchi yim̐ka nīdo maṭṭumīranela