Mana sedigim jikkenu maguvalaala

మన చేతికిఁ జిక్కెను మగువలాల
Language

(॥పల్లవి॥)
మన చేతికిఁ జిక్కెను మగువలాల
వినయాన వేఁడుకోరే వీఁడె కాంతలాల

(॥మన॥)
వుబ్బుచుఁ గృష్ణుఁడు వాఁడే వుట్టులు గొట్టీ నదే
గొబ్బునఁ బట్టఁగదరే గొల్లెతలాల
అబ్బరపుఁ బాలు వెన్న లారగించి వారవట్టీ
దొబ్బి తీసుకోరమ్మా తొయ్యలులాల

(॥మన॥)
యింటింటి వాకిట వచ్చి ఇదె చక్కిలాలు దీసీ
అంటి పెనఁగులాడరే యంగనలాల
దంటయై గోపాలులుఁ దానూఁ బరువులు వెట్టీ
వెంటనే తగులరమ్మా వెలఁదులాల

(॥మన॥)
కాకుసేసి చన్నులంటి కాఁగిలించుకొనవచ్చీ
యేకతాలకుఁ దియ్యరే యింతులాల
యీకడ నలమేల్మంగ నేలి శ్రీవేంకటేశుఁడు
మీ కోరి కిచ్చె మొక్కరే మెలుఁతలాల

(||pallavi||)
mana sedigim̐ jikkĕnu maguvalāla
vinayāna vem̐ḍugore vīm̐ḍĕ kāṁtalāla

(||mana||)
vubbusum̐ gṛṣhṇum̐ḍu vām̐ḍe vuṭṭulu gŏṭṭī nade
gŏbbunam̐ baṭṭam̐gadare gŏllĕdalāla
abbarabum̐ bālu vĕnna lāragiṁchi vāravaṭṭī
dŏbbi tīsugorammā tŏyyalulāla

(||mana||)
yiṁṭiṁṭi vāgiḍa vachchi idĕ sakkilālu dīsī
aṁṭi pĕnam̐gulāḍare yaṁganalāla
daṁṭayai gobālulum̐ dānūm̐ baruvulu vĕṭṭī
vĕṁṭane tagularammā vĕlam̐dulāla

(||mana||)
kāgusesi sannulaṁṭi kām̐giliṁchugŏnavachchī
yegadālagum̐ diyyare yiṁtulāla
yīgaḍa nalamelmaṁga neli śhrīveṁkaḍeśhum̐ḍu
mī kori kichchĕ mŏkkare mĕlum̐talāla