Mana mimta dadavaaya mamku vaabale maidimi

మన మింత దడవాయ మంకు వాపలే మైతిమి
Language

(॥పల్లవి॥)
మన మింత దడవాయ మంకు వాపలే మైతిమి
ఘనుఁడు గాన యాతఁడు కాంత కాఁక వాపెను

(॥మన॥)
చెలియమోము చూచి చెక్కులు చేత నొక్కి
కలవురేకులకొప్పు కడు దువ్వి
సెలవుల నవ్వించి చేరి మోవితేనె లాని
అలుక దేరిచెఁ బతి అదివో యిప్పుడు

(॥మన॥)
మాటలనె బుజ్జగించి మనసునొప్పులు మాన్పి
కాటుకన్నులయింతి కందువ లంటి
తేటలఁ గతలు చెప్పి దిష్టపుమన్నన లిచ్చి
యీటునఁ గోపము దీర్చె నిదివో విభుఁడు

(॥మన॥)
వనితఁ గాఁగిట నించి వాడినదప్పి దేరిచి
ననుపులు నటియించి నయ మిచ్చి
తనువు నిమిరి యీపె తత్తరాలు మందిలించె
యెనసి శ్రీవెంకటేశుఁ డిదివో యిపుడు

(||pallavi||)
mana miṁta daḍavāya maṁku vābale maidimi
ghanum̐ḍu gāna yādam̐ḍu kāṁta kām̐ka vābĕnu

(||mana||)
sĕliyamomu sūsi sĕkkulu seda nŏkki
kalavuregulagŏppu kaḍu duvvi
sĕlavula navviṁchi seri movidenĕ lāni
aluga derisĕm̐ badi adivo yippuḍu

(||mana||)
māḍalanĕ bujjagiṁchi manasunŏppulu mānpi
kāḍugannulayiṁti kaṁduva laṁṭi
teḍalam̐ gadalu sĕppi diṣhṭabumannana lichchi
yīḍunam̐ gobamu dīrsĕ nidivo vibhum̐ḍu

(||mana||)
vanidam̐ gām̐giḍa niṁchi vāḍinadappi derisi
nanubulu naḍiyiṁchi naya michchi
tanuvu nimiri yībĕ tattarālu maṁdiliṁchĕ
yĕnasi śhrīvĕṁkaḍeśhum̐ ḍidivo yibuḍu