మన మెఱిఁగినవె మాయ లిన్నియును
(॥పల్లవి॥)
మన మెఱిఁగినవె మాయ లిన్నియును
వెనకసుద్దు లెంచితె వేవేలుఁ గలవూ
(॥మన॥)
మొగము చూచితిఁగా మొక్కితిఁగా నీకు నిట్టె
జగడా లింకా నేల చాలించు
తగవు చెప్పకు మింక తడవ నే నా సుద్ది
వగ లెన్నైనాఁ గలవు వడిఁ దప్పించుకోనూ
(॥మన॥)
నెలవి నవ్వితిఁ గా చెప్పినట్టె వింటిఁ గా
చలము లింకా నేల చాలించు
బలిమి నేయకు మింక పంతము లిచ్చితి తొల్లె
వలపు రేఁచఁగ బోతే వసము గా దిఁకనూ
(॥మన॥)
కన్నుల మెచ్చితిఁగా కాఁగిట నించితిఁగా
సన్నలు చాయలు నిఁకఁ జాలించు
వున్నతి శ్రీవెంకటేశ వొద్ది కైతి నీతోను
వన్నెలు వాసులు నెంచ వలెనా యిందులోనూ
(||pallavi||)
mana mĕṟim̐ginavĕ māya linniyunu
vĕnagasuddu lĕṁchidĕ vevelum̐ galavū
(||mana||)
mŏgamu sūsidim̐gā mŏkkidim̐gā nīgu niṭṭĕ
jagaḍā liṁkā nela sāliṁchu
tagavu sĕppagu miṁka taḍava ne nā suddi
vaga lĕnnainām̐ galavu vaḍim̐ dappiṁchugonū
(||mana||)
nĕlavi navvidim̐ gā sĕppinaṭṭĕ viṁṭim̐ gā
salamu liṁkā nela sāliṁchu
balimi neyagu miṁka paṁtamu lichchidi tŏllĕ
valabu rem̐sam̐ga bode vasamu gā dim̐kanū
(||mana||)
kannula mĕchchidim̐gā kām̐giḍa niṁchidim̐gā
sannalu sāyalu nim̐kam̐ jāliṁchu
vunnadi śhrīvĕṁkaḍeśha vŏddi kaidi nīdonu
vannĕlu vāsulu nĕṁcha valĕnā yiṁdulonū