(॥పల్లవి॥)
మంతనపు సన్నలేల మానరమ్మ
చెంతలఁ జేరితే వీఁడు సిగ్గువడీనమ్మా
(॥మంత॥)
నుదురెల్ల జెమరించె నూఁగుదూళిమేనితో
అదె వీది నాడివచ్చెనమ్మ కృష్ణుఁడు
కదిసి గోపికలకాఁగిటఁ బెనఁగెనంటా
నిదులఁ గొంద రేఁటికి నిందవేసేరమ్మా
(॥మంత॥)
సారె జారేకాసె తోడ చల్లేటి ముద్దులతోడ
ఆరితేరి బుసకొట్టీనమ్మా కృష్ణుఁడు
తారి వెన్న ముచ్చిలఁగాఁ దరిమితే వచ్చెనంటా
నేరమివేసి మీరేల నిందలాడేరమ్మా
(॥మంత॥)
తేనెగారేమోవితోడ తేఁకువ శ్రీ వేంకటాద్రి-
నానుక నిలుచున్నాఁడోయమ్మ కృష్ణుడు
కానుక నింతులకే కాచుకున్నాఁ డితఁడంటా
నేనే వినఁగ నేల నిందలాడేరమ్మా
(||pallavi||)
maṁtanabu sannalela mānaramma
sĕṁtalam̐ jeride vīm̐ḍu sigguvaḍīnammā
(||maṁta||)
nudurĕlla jĕmariṁchĕ nūm̐gudūḽimenido
adĕ vīdi nāḍivachchĕnamma kṛṣhṇum̐ḍu
kadisi gobigalagām̐giḍam̐ bĕnam̐gĕnaṁṭā
nidulam̐ gŏṁda rem̐ṭigi niṁdaveserammā
(||maṁta||)
sārĕ jāregāsĕ toḍa salleḍi mudduladoḍa
ārideri busagŏṭṭīnammā kṛṣhṇum̐ḍu
tāri vĕnna muchchilam̐gām̐ darimide vachchĕnaṁṭā
neramivesi mīrela niṁdalāḍerammā
(||maṁta||)
tenĕgāremovidoḍa tem̐kuva śhrī veṁkaḍādri-
nānuga nilusunnām̐ḍoyamma kṛṣhṇuḍu
kānuga niṁtulage kāsugunnām̐ ḍidam̐ḍaṁṭā
nene vinam̐ga nela niṁdalāḍerammā