మంతనాన నాడేరమ్మ మధురలో యీ సుద్దులు
(॥పల్లవి॥)
మంతనాన నాడేరమ్మ మధురలో యీ సుద్దులు
వింతలాయ వినరమ్మ వీనుల పండుగలు
(॥॥)
గక్కనఁ గృష్ణుడు వుట్టెఁ గంసుని మదమడఁగె
మొక్కిరి దేవతలెల్లా ముదమందుచు
చక్కఁగా జయంతి నేఁడు శ్రావణబహుళాష్టమి
తక్కక దేవకి తల్లి, తండ్రి వసుదేవుఁడు
(॥॥)
యమున దాఁటి యట్టె యశోదయింటఁ బెరిగి
జమళితో బలభద్రసమేతుఁడై
సమమై చంద్రోదయము సమకూడె తోడఁదోడ
రమణఁ బువ్వులవాన రాసులుగాఁ గురిసె
(॥॥)
పనులెల్లా నీడేరె బ్రదికె లోకములెల్లా
నినుపులై ధర్మములు నెలకొనెను
వొనర నలమేల్మంగ నురమున నిడుకొని
ఘనశ్రీవేంకటేశుఁడై కందువ నిలిచెను
(||pallavi||)
maṁtanāna nāḍeramma madhuralo yī suddulu
viṁtalāya vinaramma vīnula paṁḍugalu
(||||)
gakkanam̐ gṛṣhṇuḍu vuṭṭĕm̐ gaṁsuni madamaḍam̐gĕ
mŏkkiri devadalĕllā mudamaṁdusu
sakkam̐gā jayaṁti nem̐ḍu śhrāvaṇabahuḽāṣhṭami
takkaga devagi talli, taṁḍri vasudevum̐ḍu
(||||)
yamuna dām̐ṭi yaṭṭĕ yaśhodayiṁṭam̐ bĕrigi
jamaḽido balabhadrasamedum̐ḍai
samamai saṁdrodayamu samagūḍĕ toḍam̐doḍa
ramaṇam̐ buvvulavāna rāsulugām̐ gurisĕ
(||||)
panulĕllā nīḍerĕ bradigĕ logamulĕllā
ninubulai dharmamulu nĕlagŏnĕnu
vŏnara nalamelmaṁga nuramuna niḍugŏni
ghanaśhrīveṁkaḍeśhum̐ḍai kaṁduva nilisĕnu