Mammunettu dalamsevu manasunanu

మమ్మునెట్టు దలఁచేవు మనసునను
Language

(॥పల్లవి॥)
మమ్మునెట్టు దలఁచేవు మనసునను
యెమ్మెల నెక్కడౌతా నెఱఁగక వుంటివి

(॥మమ్ము॥)
కలకల నవ్వునవ్వి కప్పురము చేతికిచ్చి
మొలకచన్నులవాఁడిమొనలుమోపి
కలికితనాలనిన్ను కరిఁగించఁగా నట్టె
యెలమి నిన్ను నీ వెఱఁగకవుఁటివి

(॥మమ్ము॥)
అందపుమాటలాడిఆయములు గోరనంటి
పొందికల పరపుపై పొద్దులు వుచ్చి
పందెములాడుచు నాపె భ్రమయించఁగా నట్టె
యెందునుఁగిందునుమీఁదు నెఱఁగక వుంటివి

(॥మమ్ము॥)
పెనఁగి సారాసారెకు బిగ్గెఁ గాఁగిలించుకొని
వొనర శ్రీవేంకటేశ వొద్దికఁ గూడి
అనువునఁ దాఁ దనిసి అప్పణియ్యఁగా, మమ్ము
యెనసితి విందాఁకా న దెరఁగకవుంటివి

(||pallavi||)
mammunĕṭṭu dalam̐sevu manasunanu
yĕmmĕla nĕkkaḍaudā nĕṟam̐gaga vuṁṭivi

(||mammu||)
kalagala navvunavvi kappuramu sedigichchi
mŏlagasannulavām̐ḍimŏnalumobi
kaligidanālaninnu karim̐giṁcham̐gā naṭṭĕ
yĕlami ninnu nī vĕṟam̐gagavum̐ṭivi

(||mammu||)
aṁdabumāḍalāḍiāyamulu goranaṁṭi
pŏṁdigala parabubai pŏddulu vuchchi
paṁdĕmulāḍusu nābĕ bhramayiṁcham̐gā naṭṭĕ
yĕṁdunum̐giṁdunumīm̐du nĕṟam̐gaga vuṁṭivi

(||mammu||)
pĕnam̐gi sārāsārĕgu biggĕm̐ gām̐giliṁchugŏni
vŏnara śhrīveṁkaḍeśha vŏddigam̐ gūḍi
anuvunam̐ dām̐ danisi appaṇiyyam̐gā, mammu
yĕnasidi viṁdām̐kā na dĕram̐gagavuṁṭivi