Mammunela yadigevu mari nee yaasaaraalu

మమ్మునేల యడిగేవు మరి నీ యాచారాలు
Language

(॥పల్లవి॥)
మమ్మునేల యడిగేవు మరి నీ యాచారాలు
చిమ్ముల నూరకవుంటే సేసినంత ఫలము

(॥మమ్ము॥)
ఆంగము నీకోప్పగించే ఆఁటదాన నేనింతే
కంగి నిన్నౌఁగాదనఁగలనా నేను
అంగడి నెవ్వరినైనా నడుగవయ్య నీగుణ-
ముంగరపువేలనైతే నోక్కమనసౌను

(॥మమ్ము॥)
సేసతోఁ బెండ్లాడినట్టిచెలియ వింతే నేను
గాసి నిన్ను దిద్దితీర్చఁగలనా నేను
ఆసల నెవ్వరినైనా నడుగవయ్య సాకిరి
బాసఁ గప్పురపు నోటిపలుకు లింపౌను

(॥మమ్ము॥)
ఇమ్ముల నీ కాఁగిటలో యిల్లాల నింతె నెను
కమ్మి నీమై పచ్చి చెప్పఁగలనా నేను
నెమ్మది శ్రీ వెంకటేశ నీడ చూచుకొనవయ్య
పమ్మి చీఁకటింటనే దీపము గానవచ్చును

(||pallavi||)
mammunela yaḍigevu mari nī yāsārālu
simmula nūragavuṁṭe sesinaṁta phalamu

(||mammu||)
āṁgamu nīgoppagiṁche ām̐ṭadāna neniṁte
kaṁgi ninnaum̐gādanam̐galanā nenu
aṁgaḍi nĕvvarinainā naḍugavayya nīguṇa-
muṁgarabuvelanaide nokkamanasaunu

(||mammu||)
sesadom̐ bĕṁḍlāḍinaṭṭisĕliya viṁte nenu
gāsi ninnu diddidīrsam̐galanā nenu
āsala nĕvvarinainā naḍugavayya sāgiri
bāsam̐ gappurabu noḍibalugu liṁpaunu

(||mammu||)
immula nī kām̐giḍalo yillāla niṁtĕ nĕnu
kammi nīmai pachchi sĕppam̐galanā nenu
nĕmmadi śhrī vĕṁkaḍeśha nīḍa sūsugŏnavayya
pammi sīm̐kaḍiṁṭane dībamu gānavachchunu