Mammunela tadavevu maadi maadigi

మమ్మునేల తడవేవు మాటి మాటికి
Language

(॥పల్లవి॥)
మమ్మునేల తడవేవు మాటి మాటికి
పమ్మి రతులకు నీకు బాఁలైతి నిపుడు

(॥మమ్ము॥)
చనవు గలిగినాపె జాణతనా లాడితేను
విననింపులై యుండు విభునికిని
ననుపున సారె సారె నవ్వులు నవ్వితేను
మనసున నిండుకొని మర్మములు గరఁగు

(॥మమ్ము॥)
బాసలు గొనినయాపె పంతానఁ గొసరితేను
ఆసలు రేఁగు మగఁడైన వానికి
సేసలు చల్లి చల్లి చెక్కులు నొక్కితేను
పోసరించినవలపు లుప్పొంగఁగఁ దొడఁగును

(॥మమ్ము॥)
పట్టపుదేవులై నాపె పై కొని కూడితేను
గుట్టుతో రమణునికి కొంకు దేరును
యిట్టె శ్రీవేంకటేశ్వర యేలితివి నన్ను నేఁడు
రట్టడి కాంతల పొందు యిట్టె రచ్చకెక్కును

(||pallavi||)
mammunela taḍavevu māḍi māḍigi
pammi radulagu nīgu bām̐laidi nibuḍu

(||mammu||)
sanavu galiginābĕ jāṇadanā lāḍidenu
vinaniṁpulai yuṁḍu vibhunigini
nanubuna sārĕ sārĕ navvulu navvidenu
manasuna niṁḍugŏni marmamulu garam̐gu

(||mammu||)
bāsalu gŏninayābĕ paṁtānam̐ gŏsaridenu
āsalu rem̐gu magam̐ḍaina vānigi
sesalu salli salli sĕkkulu nŏkkidenu
posariṁchinavalabu luppŏṁgam̐gam̐ dŏḍam̐gunu

(||mammu||)
paṭṭabudevulai nābĕ pai kŏni kūḍidenu
guṭṭudo ramaṇunigi kŏṁku derunu
yiṭṭĕ śhrīveṁkaḍeśhvara yelidivi nannu nem̐ḍu
raṭṭaḍi kāṁtala pŏṁdu yiṭṭĕ rachchagĕkkunu