మమ్ముఁ జూచి నీకేల మఱఁగులు సేయ నింత
(॥పల్లవి॥)
మమ్ముఁ జూచి నీకేల మఱఁగులు సేయ నింత
సమ్మతించి ఇఁకనైనా చనవీయరాదా
(॥మమ్ము॥)
పరాకున నీవుండఁగా పాదములొత్తీనాకె
మరిగి ఇంకనైనా మాటాడరాదా
కరి కరిఁబెట్టరాదు కాఁకల సొలయరాదు
తరుణి వినయానకే దయఁ జూడరాదా
(॥మమ్ము॥)
పవళించి వుండఁగాను బాగా లియ్యచ్చి నాపె
అవలన నేమి చూచేవు అందుకోరాదా
జవళి జండిపెట్టదు చలము సాదించదు
జవరాలివూడిగము సారె మెచ్చరాదా
(॥మమ్ము॥)
సిగ్గుతోడ నీవుండఁగా చెనకవచ్చీ నాపె
యెగ్గులేదు కాఁగిటిలో నెనయరాదా
నిగ్గుల నిట్టె పొగడీ నిన్ను శ్రీవేంకటేతశుఁడ
అగ్గపు టలమేల్ మంగ నాదరించరాదా
(||pallavi||)
mammum̐ jūsi nīgela maṟam̐gulu seya niṁta
sammadiṁchi im̐kanainā sanavīyarādā
(||mammu||)
parāguna nīvuṁḍam̐gā pādamulŏttīnāgĕ
marigi iṁkanainā māḍāḍarādā
kari karim̐bĕṭṭarādu kām̐kala sŏlayarādu
taruṇi vinayānage dayam̐ jūḍarādā
(||mammu||)
pavaḽiṁchi vuṁḍam̐gānu bāgā liyyachchi nābĕ
avalana nemi sūsevu aṁdugorādā
javaḽi jaṁḍibĕṭṭadu salamu sādiṁchadu
javarālivūḍigamu sārĕ mĕchcharādā
(||mammu||)
siggudoḍa nīvuṁḍam̐gā sĕnagavachchī nābĕ
yĕgguledu kām̐giḍilo nĕnayarādā
niggula niṭṭĕ pŏgaḍī ninnu śhrīveṁkaḍedaśhum̐ḍa
aggabu ṭalamel maṁga nādariṁcharādā