మమ్ము సాకిరివెట్టేవు మాటిమాటికి
(॥పల్లవి॥)
మమ్ము సాకిరివెట్టేవు మాటిమాటికి
యిమ్ముల మమ్మేలితిరి యేమనేమయ్యా
(॥॥)
వొద్దనుండి నీతోఁ జెలి వొట్టువెట్టుక వున్నది
గద్దించి పిలిచేవిటు కమ్మటి నీవు
వుద్దండము నీవొళ్ళిది వువిదవల్లఁ జలము
యిద్దర నిద్దరే నేము యేమనేమయ్యా
(॥॥)
ముప్పిరిఁ బాన్పుపై నాపె ముసుఁగు వెట్టుకున్నది
అప్పుడే మాటాడుమని యానవెట్టేవు
తప్పులు నీగుణాలవి తరుణి వాసికత్తె
యెప్పుడు మీరు మీరే యేమనేమయ్యా
(॥॥)
అంగన చెక్కుచేతితో నసురసురై వున్నది
యెంగిలిగాఁ జేసి మోవి యెనసితివి
ముంగిటనాపె నవ్వితే మొక్కేవు శ్రీవేంకటేశ
యింగితపు జాణలు మిమ్మేమనేమయ్యా
(||pallavi||)
mammu sāgirivĕṭṭevu māḍimāḍigi
yimmula mammelidiri yemanemayyā
(||||)
vŏddanuṁḍi nīdom̐ jĕli vŏṭṭuvĕṭṭuga vunnadi
gaddiṁchi piliseviḍu kammaḍi nīvu
vuddaṁḍamu nīvŏḽḽidi vuvidavallam̐ jalamu
yiddara niddare nemu yemanemayyā
(||||)
muppirim̐ bānpubai nābĕ musum̐gu vĕṭṭugunnadi
appuḍe māḍāḍumani yānavĕṭṭevu
tappulu nīguṇālavi taruṇi vāsigattĕ
yĕppuḍu mīru mīre yemanemayyā
(||||)
aṁgana sĕkkusedido nasurasurai vunnadi
yĕṁgiligām̐ jesi movi yĕnasidivi
muṁgiḍanābĕ navvide mŏkkevu śhrīveṁkaḍeśha
yiṁgidabu jāṇalu mimmemanemayyā