Mammu ninnidaa nimka mannimchum gaaga

మమ్ము నిన్నిటా నిఁక మన్నించుఁ గాక
Language

(॥పల్లవి॥)
మమ్ము నిన్నిటా నిఁక మన్నించుఁ గాక
చిమ్ముసిగ్గులఁ దడవు సేయ నేఁటికే

(॥మమ్ము॥)
వలపించుకొన్నవాఁడు వాకిటికె వచ్చుఁ గాక
పిలిపించుకొన నేలె పెనఁగ నేలె
చలి వాసినట్టివాఁడు సరసము లాడుఁ గాక
యెలయించి యెడమాఁట లిఁక నేఁటికే

(॥మమ్ము॥)
చేసుకొన్న యట్టివాఁడు చెప్పినట్టె నేసుఁ గాక
మూసి దాఁపిరము లేలె మొరఁగు లేలె
ఆసపడినట్టివాఁడు అండనె కూచుండుఁగాక
వోసరించి మరి కొన్ని వొడఁబా ట్లేఁటికే

(॥మమ్ము॥)
చేయి చాఁచినట్టివాఁడు చెనకి కలసుఁగాక
నాయముల వెట్ట నేలె నలన లేలె
యీయెడ శ్రీవెంకటశుఁ డేకమై కూడినవాఁడు
చాయలకు లోలోనిసన్న లిఁక నేఁటికే

(||pallavi||)
mammu ninniḍā nim̐ka manniṁchum̐ gāga
simmusiggulam̐ daḍavu seya nem̐ṭige

(||mammu||)
valabiṁchugŏnnavām̐ḍu vāgiḍigĕ vachchum̐ gāga
pilibiṁchugŏna nelĕ pĕnam̐ga nelĕ
sali vāsinaṭṭivām̐ḍu sarasamu lāḍum̐ gāga
yĕlayiṁchi yĕḍamām̐ṭa lim̐ka nem̐ṭige

(||mammu||)
sesugŏnna yaṭṭivām̐ḍu sĕppinaṭṭĕ nesum̐ gāga
mūsi dām̐piramu lelĕ mŏram̐gu lelĕ
āsabaḍinaṭṭivām̐ḍu aṁḍanĕ kūsuṁḍum̐gāga
vosariṁchi mari kŏnni vŏḍam̐bā ṭlem̐ṭige

(||mammu||)
seyi sām̐sinaṭṭivām̐ḍu sĕnagi kalasum̐gāga
nāyamula vĕṭṭa nelĕ nalana lelĕ
yīyĕḍa śhrīvĕṁkaḍaśhum̐ ḍegamai kūḍinavām̐ḍu
sāyalagu lolonisanna lim̐ka nem̐ṭige