మమ్ము నింకఁ దడవక మానేవయ్యా
(॥పల్లవి॥)
మమ్ము నింకఁ దడవక మానేవయ్యా
నెమ్మి వేవేలు దండాలు నీకుఁ బెట్టేమయ్యా
(॥॥)
చెప్పరానినాచింత చేతిమీఁదికి వచ్చె
తప్పక నన్నేమి చూచి తడవేవయ్యా
నెప్పున వలచినట్టినేరమి నావొళ్ళఁ గద్దు
వొప్పులుఁ దప్పులు నీవే వోరుచుకోవయ్యా
(॥॥)
కన్నులలోపలికాంక్ష కడుఁ బయ్యద దడిసె
నన్నుఁజూచి ఇఁకనేమి నవ్వేవయ్యా
పన్ని నీతో నలిగినఫలమెల్లా నేఁ గంటి
ఇన్నిటికి నీకుఁ బంత మిచ్చేము కోవయ్యా
(॥॥)
తలకెక్కె వలపులు తనుఁదానె దిగజారె
మలసి మాతో నేఁటిమాటలయ్యా
యెలమి శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
చెలఁగి మాచనవుల చెల్లించవయ్యా
(||pallavi||)
mammu niṁkam̐ daḍavaga mānevayyā
nĕmmi vevelu daṁḍālu nīgum̐ bĕṭṭemayyā
(||||)
sĕpparānināsiṁta sedimīm̐digi vachchĕ
tappaga nannemi sūsi taḍavevayyā
nĕppuna valasinaṭṭinerami nāvŏḽḽam̐ gaddu
vŏppulum̐ dappulu nīve vorusugovayyā
(||||)
kannulalobaligāṁkṣha kaḍum̐ bayyada daḍisĕ
nannum̐jūsi im̐kanemi navvevayyā
panni nīdo naliginaphalamĕllā nem̐ gaṁṭi
inniḍigi nīgum̐ baṁta michchemu kovayyā
(||||)
talagĕkkĕ valabulu tanum̐dānĕ digajārĕ
malasi mādo nem̐ṭimāḍalayyā
yĕlami śhrī veṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
sĕlam̐gi māsanavula sĕlliṁchavayyā