మమ్ము నేమియడిగేవు మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మమ్ము నేమియడిగేవు మాపు దాఁకాను
సమ్మతిగా సేసలు చల్లుకోరాదా
(॥మమ్ము ॥)
కాంతునికిచ్చే కానుక కమ్మి నీవందుకొనేవు
యెంతచనవరిదాన వేమిచెప్పేదే
వింతగా విన్నవించితే వెస నీవు వూఁకొనేవు
మంతుకెక్క నీవనితమారైతివటవే
(॥నిన్నే॥)
చెలువునికి మొక్కితే చేరి నీవు దీవించేవు
యిల నెంత నేర్పరివే యేచసుద్దులే
సెలవి నేనవ్వితేను సిగ్గులు నీవు వడేవు
కులికి యాతనిచేఁతకు గురి నీవటవే
(॥నిన్నే॥)
శ్రీవేంకటేశుఁ గూడితే చేత నన్ను మెచ్చేవు
నీ వలమేలుమంగ వన్నిట జాణవే
ఆవేళ నేఁ జుట్టిచ్చితే ఆకు నీ వందుకొనేవు
దేవుల వితనిగుట్టు తెలిసితివటవే
(||pallavi||)
mammu nemiyaḍigevu mābu dām̐kānu
sammadigā sesalu sallugorādā
(||mammu ||)
kāṁtunigichche kānuga kammi nīvaṁdugŏnevu
yĕṁtasanavaridāna vemisĕppede
viṁtagā vinnaviṁchide vĕsa nīvu vūm̐kŏnevu
maṁtugĕkka nīvanidamāraidivaḍave
(||ninne||)
sĕluvunigi mŏkkide seri nīvu dīviṁchevu
yila nĕṁta nerbarive yesasuddule
sĕlavi nenavvidenu siggulu nīvu vaḍevu
kuligi yādanisem̐tagu guri nīvaḍave
(||ninne||)
śhrīveṁkaḍeśhum̐ gūḍide seda nannu mĕchchevu
nī valamelumaṁga vanniḍa jāṇave
āveḽa nem̐ juṭṭichchide āgu nī vaṁdugŏnevu
devula vidaniguṭṭu tĕlisidivaḍave