Mammu nemi yadigevu maabu daamkaanu

మమ్ము నేమి యడిగేవు మాపు దాఁకాను
Language

(॥పల్లవి॥)
మమ్ము నేమి యడిగేవు మాపు దాఁకాను
చిమ్మి రేఁగె సంతోసాలు చిత్తగించవయ్యా

(॥మమ్ము॥)
మచ్చికలు చెలియాడే మంతనాలలో నున్నవి
ముచ్చటలు తేనెగారే మోవి నున్నవి
కచ్చుకొన్న వేడుకలు కనుచూపులో నున్నవి
విచ్చన విడిగా నీవు విచారించుకోవయ్యా

(॥మమ్ము॥)
చిడుముడి కోరికలు చెక్కు చేతిలో నన్నవి
అడియాసలు జాగరాలం దున్నవి
గుడి గొన్న సిగ్గులు గుబ్బలపై నున్నవి
తడఁబడక నీలోనే తలఁచుకోవయ్యా

(॥మమ్ము॥)
నాటుకొన్న సరసాలు నగవులలో నున్నవి
గాఁటపుఁ గళలెల్లా మొగాన నున్నవి
యీటుతో శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
తేటల నీ వేలితివి తెలుసుకోవయ్యా

(||pallavi||)
mammu nemi yaḍigevu mābu dām̐kānu
simmi rem̐gĕ saṁtosālu sittagiṁchavayyā

(||mammu||)
machchigalu sĕliyāḍe maṁtanālalo nunnavi
muchchaḍalu tenĕgāre movi nunnavi
kachchugŏnna veḍugalu kanusūbulo nunnavi
vichchana viḍigā nīvu visāriṁchugovayyā

(||mammu||)
siḍumuḍi korigalu sĕkku sedilo nannavi
aḍiyāsalu jāgarālaṁ dunnavi
guḍi gŏnna siggulu gubbalabai nunnavi
taḍam̐baḍaga nīlone talam̐sugovayyā

(||mammu||)
nāḍugŏnna sarasālu nagavulalo nunnavi
gām̐ṭabum̐ gaḽalĕllā mŏgāna nunnavi
yīḍudo śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
teḍala nī velidivi tĕlusugovayyā