Mammu nemi yadigeru maadimaadigi

మమ్ము నేమి యడిగేరు మాటిమాటికి
Language

(॥పల్లవి॥)
మమ్ము నేమి యడిగేరు మాటిమాటికి
తెమ్మైన మీ పెదవుల తేనెలు చెప్పేమా

(॥మమ్ము॥)
పలికిన పలుకులు పట్టఁ జెప్పుదుము గాక
తలఁపు చెప్పుదుమా తరుణులము
వలసినట్లు మీవావులు చెప్పేము గాక
చెలువపు మీలోని సిగ్గులు చెప్పుదుమా

(॥మమ్ము॥)
బాసలు చేసుకొనిన పనులు చెప్పేము గాక
ఆసలు చెప్పుదుమా అంగనలము
సేసలు వెట్టుకొనిన చేఁతలు చెప్పేము గాక
రాసికెక్కినటువంటి రతులు చెప్పుదుమా

(॥మమ్ము॥)
తగినయట్టి మీచక్కఁదనము చెప్పేము గాక
నగవు చెప్పుదుమా నాతులము
మిగుల శ్రీ వేంకటేశ మీరిద్దరు గూడితిరి
మొగమోడినట్టి మీలో ముచ్చట చెప్పుదుమా

(||pallavi||)
mammu nemi yaḍigeru māḍimāḍigi
tĕmmaina mī pĕdavula tenĕlu sĕppemā

(||mammu||)
paligina palugulu paṭṭam̐ jĕppudumu gāga
talam̐pu sĕppudumā taruṇulamu
valasinaṭlu mīvāvulu sĕppemu gāga
sĕluvabu mīloni siggulu sĕppudumā

(||mammu||)
bāsalu sesugŏnina panulu sĕppemu gāga
āsalu sĕppudumā aṁganalamu
sesalu vĕṭṭugŏnina sem̐talu sĕppemu gāga
rāsigĕkkinaḍuvaṁṭi radulu sĕppudumā

(||mammu||)
taginayaṭṭi mīsakkam̐danamu sĕppemu gāga
nagavu sĕppudumā nādulamu
migula śhrī veṁkaḍeśha mīriddaru gūḍidiri
mŏgamoḍinaṭṭi mīlo muchchaḍa sĕppudumā