Mammu nela tadaveru maadimaamtigi

మమ్ము నేల తడవేరు మాటిమాఁటికి
Language

(॥పల్లవి॥)
మమ్ము నేల తడవేరు మాటిమాఁటికి
వొమ్మదు మాకు వలపు లో చెలులాల

(॥మమ్ము॥)
మన నెల్లా నివ్వెరగు మాటలు నాకు వేసట
యెన లేనికత లెల్లా నేమి చెప్పేరే
విన నోప మారుమాట వివరించా నే నోప
అనుమాన మెల్లఁ దీర నాతని నడుగరే

(॥మమ్ము॥)
కాయముపైఁ జెమటలు కన్నులపై వసినాడు
చేయి వట్టాతని నేల చేరఁ దీసేరే
సేయ లేను వినయాలు చేచేతఁ గొసర లేను
మాయకాఁ డాతని మీరె మనసు దెలియరే

(॥మమ్ము॥)
నిమిష మొక్కటి యేఁడు నిండుఁబాయము తరవు
భ్రమయించి యాల వొడఁబరచేరే
సమరతి శ్రీవెంకటేశ్వరుఁ డిట్టె నన్ను గూడె
తమితో నాతని మీరు తప్పక నవ్వించరే

(||pallavi||)
mammu nela taḍaveru māḍimām̐ṭigi
vŏmmadu māgu valabu lo sĕlulāla

(||mammu||)
mana nĕllā nivvĕragu māḍalu nāgu vesaḍa
yĕna lenigada lĕllā nemi sĕppere
vina noba mārumāḍa vivariṁchā ne noba
anumāna mĕllam̐ dīra nādani naḍugare

(||mammu||)
kāyamubaim̐ jĕmaḍalu kannulabai vasināḍu
seyi vaṭṭādani nela seram̐ dīsere
seya lenu vinayālu sesedam̐ gŏsara lenu
māyagām̐ ḍādani mīrĕ manasu dĕliyare

(||mammu||)
nimiṣha mŏkkaḍi yem̐ḍu niṁḍum̐bāyamu taravu
bhramayiṁchi yāla vŏḍam̐barasere
samaradi śhrīvĕṁkaḍeśhvarum̐ ḍiṭṭĕ nannu gūḍĕ
tamido nādani mīru tappaga navviṁchare