మమ్ము నేల చెనకేవు మాటి మాటికి
(॥పల్లవి॥)
మమ్ము నేల చెనకేవు మాటి మాటికి
కమ్మర నిట్టే బండి కాలఁ దన్నవయ్యా
(॥మమ్ము॥)
పొద్దు వోకుండితే దొడ్డిపొంత కయినాఁ బోవయ్యా
వొద్ద నుండి మమ్ము నొకటొక టాడక
వుద్ధండాన మోన్నదిన్నవుబ్బు నీకు గలిగితే
కొద్దిమాలి నీవు పెద్దకొండ లెత్తవయ్యా
(॥మమ్ము॥)
చే యూరకుండ కుండితే చీరలు దొంగిలవయ్యా
యీ యెడ మాపై గోళ్ళేల చిమ్మేవు
సేయరానిపనులకు చెల్లుబడి గలిగితే
పాయపు గొల్లెతలనే పట్టుకొనవయ్యా
(॥మమ్ము॥)
మనసు దనియ దంటే మడుగులు చొరవయ్య
పెనఁ గీనా చెమటలే ప్రియ మనక
యెనసితివి శ్రీవేంకటేశ్వరుఁడ నారతి
అనువై నీ కొక్క మనసాయఁ గదవయ్యా
(||pallavi||)
mammu nela sĕnagevu māḍi māḍigi
kammara niṭṭe baṁḍi kālam̐ dannavayyā
(||mammu||)
pŏddu voguṁḍide dŏḍḍibŏṁta kayinām̐ bovayyā
vŏdda nuṁḍi mammu nŏgaḍŏga ṭāḍaga
vuddhaṁḍāna monnadinnavubbu nīgu galigide
kŏddimāli nīvu pĕddagŏṁḍa lĕttavayyā
(||mammu||)
se yūraguṁḍa kuṁḍide sīralu dŏṁgilavayyā
yī yĕḍa mābai goḽḽela simmevu
seyarānibanulagu sĕllubaḍi galigide
pāyabu gŏllĕdalane paṭṭugŏnavayyā
(||mammu||)
manasu daniya daṁṭe maḍugulu sŏravayya
pĕnam̐ gīnā sĕmaḍale priya managa
yĕnasidivi śhrīveṁkaḍeśhvarum̐ḍa nāradi
anuvai nī kŏkka manasāyam̐ gadavayyā