Mammemi yaadugonevu marmamulu remsemani

మమ్మేమి యాడుకొనేవు మర్మములు రేఁచేమని
Language

(॥పల్లవి॥)
మమ్మేమి యాడుకొనేవు మర్మములు రేఁచేమని
చిమ్ముల మరుఁడు తొల్లే సేసినమాయలివి

(॥మమ్మేమి॥)
మొక్కలానఁ బొలసితేను మురిపెము లొలికేది
చక్కని సతులకును సాజమే యిది
తెక్కుల మాఁటలాడితే తేనెలట్టే వూరేది
గక్కన జవ్వనులకుఁ గలదే యిది

(॥మమ్మేమి॥)
చివ్వన నిలిచితే ను సింగారాలుట్టిపడేది
జవ్వనపుటింతులకు సాజమే యిది
రవ్వలుగ నివ్వితేను రసము లుట్టిపడేది
మవ్వపు మానినుల మతము లివి

(॥మమ్మేమి॥)
తమకించి చూచితేను తళుకున మెరిచేది
సమ మోహపుటింతుల సాజమే యిది
అమర శ్రీవేంకటేశ అన్నిటా నన్నేలితివి
కొమరెలకు సిగ్గులే గుణములివి

(||pallavi||)
mammemi yāḍugŏnevu marmamulu rem̐semani
simmula marum̐ḍu tŏlle sesinamāyalivi

(||mammemi||)
mŏkkalānam̐ bŏlasidenu muribĕmu lŏligedi
sakkani sadulagunu sājame yidi
tĕkkula mām̐ṭalāḍide tenĕlaṭṭe vūredi
gakkana javvanulagum̐ galade yidi

(||mammemi||)
sivvana niliside nu siṁgārāluṭṭibaḍedi
javvanabuḍiṁtulagu sājame yidi
ravvaluga nivvidenu rasamu luṭṭibaḍedi
mavvabu māninula madamu livi

(||mammemi||)
tamagiṁchi sūsidenu taḽuguna mĕrisedi
sama mohabuḍiṁtula sājame yidi
amara śhrīveṁkaḍeśha anniḍā nannelidivi
kŏmarĕlagu siggule guṇamulivi