మమ్మేమి చూచేవు నీవు మాఁటిమాఁటికి
(॥పల్లవి॥)
మమ్మేమి చూచేవు నీవు మాఁటిమాఁటికి
దిమ్ముల మీలోమీరే తెలుసుకోరయ్యా
(॥మమ్మే॥)
తతి నామొగమైయుండి తలఁచుక నవ్వేవు
సతి నీతోనన్నమాట సరివచ్చెనా
మతకరివాఁడవు మాయదారి ఆపె నీకు
ఇతవుగ మరుఁడు మిమ్మెట్టు గూర్చెనయ్యా
(॥మమ్మే॥)
పందేలు వేయుచు నాతో పచ్చిమాటలాడేవు
అందిచ్చి నాఁడె నీకు ఆపె నేర్పెనా
అందగాఁడవు నీవైతే అంకెలు నేరుచునాపె
ఇందుకునందుకు సరి యెట్టుగూర్చె మరుఁడు
(॥మమ్మే॥)
శ్రీ వేంకటేశుఁడ నన్నుఁ జిత్తగించి కూడితివి
వేవేలుగ నాపె నీకు విన్నవించెనా
దేవర విన్నిటా నీవు దేవులమ్మ ఆపె నీకు
యీవిధాల మరుఁడు మి మ్మెట్టు గూర్చె నిపుడు
(||pallavi||)
mammemi sūsevu nīvu mām̐ṭimām̐ṭigi
dimmula mīlomīre tĕlusugorayyā
(||mamme||)
tadi nāmŏgamaiyuṁḍi talam̐suga navvevu
sadi nīdonannamāḍa sarivachchĕnā
madagarivām̐ḍavu māyadāri ābĕ nīgu
idavuga marum̐ḍu mimmĕṭṭu gūrsĕnayyā
(||mamme||)
paṁdelu veyusu nādo pachchimāḍalāḍevu
aṁdichchi nām̐ḍĕ nīgu ābĕ nerbĕnā
aṁdagām̐ḍavu nīvaide aṁkĕlu nerusunābĕ
iṁdugunaṁdugu sari yĕṭṭugūrsĕ marum̐ḍu
(||mamme||)
śhrī veṁkaḍeśhum̐ḍa nannum̐ jittagiṁchi kūḍidivi
veveluga nābĕ nīgu vinnaviṁchĕnā
devara vinniḍā nīvu devulamma ābĕ nīgu
yīvidhāla marum̐ḍu mi mmĕṭṭu gūrsĕ nibuḍu