మమ్మేమి చెప్పేవు మానినులము
(॥పల్లవి॥)
మమ్మేమి చెప్పేవు మానినులము
వుమ్మగిల నాపె నీ వొడివట్టి తీసును
(॥మమ్మే॥)
నీకు మోహించినయట్టి నెలఁతదే భాగ్యము
కాకరితనాన నీకాలు దొక్కును
రాకొట్టులు గొట్టులు సాజసము చూపి మోపి
దాకొని నీవదనానఁ దమ్ములము వెట్టును
(॥మమ్మే॥)
తక్కక నీ సేవసేసే తరుణిదే భాగ్యము
చెక్కుమీఁదఁ జేయివేసి సేదదేర్చును
చుక్కలువలె మోవిపై సూదివాట్లంటించును
గుక్కక పూవులు చెక్కుఁ గొప్పువట్టి తీసును
(॥మమ్మే॥)
వావి నీకుఁ గలసిన వనితదే భాగ్యము
బూవపు టెంగిలి పొత్తు పొసఁగించును
యీవేళ శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
ఆవలి యీవలి వారితో నాపె నిన్నుఁ దిట్టును
(||pallavi||)
mammemi sĕppevu māninulamu
vummagila nābĕ nī vŏḍivaṭṭi tīsunu
(||mamme||)
nīgu mohiṁchinayaṭṭi nĕlam̐tade bhāgyamu
kāgaridanāna nīgālu dŏkkunu
rāgŏṭṭulu gŏṭṭulu sājasamu sūbi mobi
dāgŏni nīvadanānam̐ dammulamu vĕṭṭunu
(||mamme||)
takkaga nī sevasese taruṇide bhāgyamu
sĕkkumīm̐dam̐ jeyivesi sedadersunu
sukkaluvalĕ movibai sūdivāṭlaṁṭiṁchunu
gukkaga pūvulu sĕkkum̐ gŏppuvaṭṭi tīsunu
(||mamme||)
vāvi nīgum̐ galasina vanidade bhāgyamu
būvabu ṭĕṁgili pŏttu pŏsam̐giṁchunu
yīveḽa śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
āvali yīvali vārido nābĕ ninnum̐ diṭṭunu