(॥పల్లవి॥)
మమ్మేమడిగేవు నీ మతకములు
నెమ్మది నుండేవారము నెపాలు నేరుతుమా
(॥మమ్మే॥)
నీచిత్త మాపె యెఱుఁగు నీవెఱుఁగుదువు గాక
యేచి నీదేవరహస్యా లెవ్వఁ డెఱుగు
వాచవులకు నేము వద్దనుండి మాటలాడి
చూచేవార మింతేకాక సోదించఁగలమా
(॥మమ్మే॥)
నీతో నాపె నవ్వఁ జెల్లు నీకుఁ జెల్లు నింతేకాక
యేతుల మీవీడుదోళ్లు యెవ్వఁ డెఱుగు
చేతులార నేము నీకు సేవలేమయినాఁ జేసి
పోతరించే మింతేకాక బుద్ది చెప్పఁగలమా
(॥మమ్మే॥)
కోరినట్టే నిన్నుఁ గూడె కొమ్మఁ గూడితివి నీవు
యీరీతి మీ వూహపోహ లెవ్వఁ డెఱుగు
చేరి నన్నుఁ గలసితి శ్రీవేంకటేశ్వర నేఁడు
నేరుపుమిమ్మెంతుఁగాక నీటు చూపఁగలమా
(||pallavi||)
mammemaḍigevu nī madagamulu
nĕmmadi nuṁḍevāramu nĕbālu nerudumā
(||mamme||)
nīsitta mābĕ yĕṟum̐gu nīvĕṟum̐guduvu gāga
yesi nīdevarahasyā lĕvvam̐ ḍĕṟugu
vāsavulagu nemu vaddanuṁḍi māḍalāḍi
sūsevāra miṁtegāga sodiṁcham̐galamā
(||mamme||)
nīdo nābĕ navvam̐ jĕllu nīgum̐ jĕllu niṁtegāga
yedula mīvīḍudoḽlu yĕvvam̐ ḍĕṟugu
sedulāra nemu nīgu sevalemayinām̐ jesi
podariṁche miṁtegāga buddi sĕppam̐galamā
(||mamme||)
korinaṭṭe ninnum̐ gūḍĕ kŏmmam̐ gūḍidivi nīvu
yīrīdi mī vūhaboha lĕvvam̐ ḍĕṟugu
seri nannum̐ galasidi śhrīveṁkaḍeśhvara nem̐ḍu
nerubumimmĕṁtum̐gāga nīḍu sūbam̐galamā