మమ్మేల వుప్పతించేవు మంచముపైకి రావయ్య
(॥పల్లవి॥)
మమ్మేల వుప్పతించేవు మంచముపైకి రావయ్య
యిమ్ముల మా తరితీపు లెలయించీనా
(॥॥)
చిగురుఁబెదవిమీఁద జిమ్మి రేఁగే మామాటలు
యెగసక్కేలై నీకవి యేమి సేసీని
మొగమోటగట మా మోములోని చూపులు
వగవగలను నీకు వాండ్లయ్యీనా
(॥॥)
అరచందురునిఁ బోలినట్టి మానొసలి బొమ్మ-
లిరవై నిన్ను జంకించి యేమి సేసీని
సరిఁదీగెవంటి మేన జనియంచిన చన్నులు
వొరసి పెనఁగితే నీవొళ్లు నొచ్చీనా
(॥॥)
ముంచి తామెరచేతుల మొలచిన కొనగోరు
ఇంచుకంత నిన్నుసోఁకి యేమి సేసీని
అంచల శ్రీవేంకటేశ అన్నిటా నన్నేలితివి
వంచన మామొక్కు నిన్ను వంచుకొనీనా
(||pallavi||)
mammela vuppadiṁchevu maṁchamubaigi rāvayya
yimmula mā taridību lĕlayiṁchīnā
(||||)
sigurum̐bĕdavimīm̐da jimmi rem̐ge māmāḍalu
yĕgasakkelai nīgavi yemi sesīni
mŏgamoḍagaḍa mā momuloni sūbulu
vagavagalanu nīgu vāṁḍlayyīnā
(||||)
arasaṁdurunim̐ bolinaṭṭi mānŏsali bŏmma-
liravai ninnu jaṁkiṁchi yemi sesīni
sarim̐dīgĕvaṁṭi mena janiyaṁchina sannulu
vŏrasi pĕnam̐gide nīvŏḽlu nŏchchīnā
(||||)
muṁchi tāmĕrasedula mŏlasina kŏnagoru
iṁchugaṁta ninnusom̐ki yemi sesīni
aṁchala śhrīveṁkaḍeśha anniḍā nannelidivi
vaṁchana māmŏkku ninnu vaṁchugŏnīnā