Mammela vinumaneru maadalu mee iddarini

మమ్మేల వినుమనేరు మాటలు మీ ఇద్దరిని
Language

(॥పల్లవి॥)
మమ్మేల వినుమనేరు మాటలు మీ ఇద్దరిని
నమ్మించి మీ చెలులము నవ్వుదుము గాక*

(॥మమ్మే॥)
తగువులు చెప్పనేల తలఁపు లేకములైతే
మిగిలేవి కడు మందెమేళాలే కాక
తెగువలు మరియేల తేరెను మీ జగడాలు
మిగుల మిమ్మిద్దరిని మెత్తుము గాక

(॥మమ్మే॥)
వొడఁబరచఁగనేల వునుకొను చక్కనైతే
అడియాలములు మేను లమరుగాక
వడఁబడ నిఁకనేల వచ్చెను మీ పంతములు
వుడివోని నుతులను వుబ్బింతువుగాక

(॥మమ్మే॥)
బుద్దులు చెప్పఁగనేల భోగములు గలసితే
కొద్దిలేని చనవులే కూడించుఁగాక
పొద్దున శ్రీ వేంకటేశ పొందితిరి సంబటూర
ముద్దుల చెన్నుఁడ మీకు మొక్కుదుముగాక

(||pallavi||)
mammela vinumaneru māḍalu mī iddarini
nammiṁchi mī sĕlulamu navvudumu gāga*

(||mamme||)
taguvulu sĕppanela talam̐pu legamulaide
migilevi kaḍu maṁdĕmeḽāle kāga
tĕguvalu mariyela terĕnu mī jagaḍālu
migula mimmiddarini mĕttumu gāga

(||mamme||)
vŏḍam̐barasam̐ganela vunugŏnu sakkanaide
aḍiyālamulu menu lamarugāga
vaḍam̐baḍa nim̐kanela vachchĕnu mī paṁtamulu
vuḍivoni nudulanu vubbiṁtuvugāga

(||mamme||)
buddulu sĕppam̐ganela bhogamulu galaside
kŏddileni sanavule kūḍiṁchum̐gāga
pŏdduna śhrī veṁkaḍeśha pŏṁdidiri saṁbaḍūra
muddula sĕnnum̐ḍa mīgu mŏkkudumugāga