మమ్మేల సాదించేవు మాటిమాటికి
(॥పల్లవి॥)
మమ్మేల సాదించేవు మాటిమాటికి
యెమ్మెల కాతఁడే నీ యెగుట నుండఁగను
(॥మమ్మే॥)
బలిమిగాలదానవు పంతాన మగనితోనే
పిలిచి సాములుసేసి పెనఁగవమ్మా
చెలఁగి మాపైనేల చేతులు చాఁచేవు నీవు
కొలఁదిమీర నాతఁడే గురి నీవుండఁగాను
(॥మమ్మే ॥)
బింకముగలదానవు బిగిసి యాతనితోనే
సుంకుమోపి నీవుదుటు చూపవమ్మా
మంకు నీపెద్దరికాలు మాతో నింత యేమిటికి
వంకలొత్త నాతఁడే నీవద్దనుండఁగాను
(॥మమ్మే॥)
నేరుపరిదానవు నేఁడు శ్రీవేంకటేశుతో
కూరిమిఁ గాఁగిట నించి కూడవమ్మా
సారె నన్నేలె నితండు సలిగెలు నెరపేవు
పోరచి నాతఁడే నీకు బుద్ది చెప్పఁగాను
(||pallavi||)
mammela sādiṁchevu māḍimāḍigi
yĕmmĕla kādam̐ḍe nī yĕguḍa nuṁḍam̐ganu
(||mamme||)
balimigāladānavu paṁtāna maganidone
pilisi sāmulusesi pĕnam̐gavammā
sĕlam̐gi mābainela sedulu sām̐sevu nīvu
kŏlam̐dimīra nādam̐ḍe guri nīvuṁḍam̐gānu
(||mamme ||)
biṁkamugaladānavu bigisi yādanidone
suṁkumobi nīvuduḍu sūbavammā
maṁku nībĕddarigālu mādo niṁta yemiḍigi
vaṁkalŏtta nādam̐ḍe nīvaddanuṁḍam̐gānu
(||mamme||)
nerubaridānavu nem̐ḍu śhrīveṁkaḍeśhudo
kūrimim̐ gām̐giḍa niṁchi kūḍavammā
sārĕ nannelĕ nidaṁḍu saligĕlu nĕrabevu
porasi nādam̐ḍe nīgu buddi sĕppam̐gānu