Mammela pogadevu maamtimaamtigi

మమ్మేల పొగడేవు మాఁటిమాఁటికి
Language

(॥పల్లవి॥)
మమ్మేల పొగడేవు మాఁటిమాఁటికి
చిమ్ముచు మాతోడి పొందు సేసేదేకాక

(॥మమ్మే॥)
చెయ్యారా నేముసేసేసేవ లేమి వున్నవి
ఇయ్యకొని నీవు మమ్ము నేలేదేకాక
వేయై నా నేము సేసేవిన్నపము లేమున్నవి
వొయ్యనే చనవిచ్చి వొద్దికౌటగాక

(॥మమ్మే॥)
పైపై నేము సేసేబత్తు లేమి వున్నవి
వోపి నీవు మావద్ద నుండేదేకాక
యేపొద్దు మావినయములెంచ నేమి వున్నవి
కాపాడి మాపాటిటఁ గలిగేదే కాక

(॥మమ్మే॥)
కందువ నేము గూడి కరఁగించే దేమున్నది
అంది నీవు భోగించే దదియే కాక
యందరిలో శ్రీవేంకటేశ నన్నెనసితివి
మందలించ నేమున్నది మరుగుటే కాక

(||pallavi||)
mammela pŏgaḍevu mām̐ṭimām̐ṭigi
simmusu mādoḍi pŏṁdu sesedegāga

(||mamme||)
sĕyyārā nemuseseseva lemi vunnavi
iyyagŏni nīvu mammu neledegāga
veyai nā nemu sesevinnabamu lemunnavi
vŏyyane sanavichchi vŏddigauḍagāga

(||mamme||)
paibai nemu sesebattu lemi vunnavi
vobi nīvu māvadda nuṁḍedegāga
yebŏddu māvinayamulĕṁcha nemi vunnavi
kābāḍi mābāḍiḍam̐ galigede kāga

(||mamme||)
kaṁduva nemu gūḍi karam̐giṁche demunnadi
aṁdi nīvu bhogiṁche dadiye kāga
yaṁdarilo śhrīveṁkaḍeśha nannĕnasidivi
maṁdaliṁcha nemunnadi maruguḍe kāga