మమ్మేల దూరేవు నీవు మాఁటిమాఁటికి
(॥పల్లవి॥)
మమ్మేల దూరేవు నీవు మాఁటిమాఁటికి
అమ్మరో నేమా నిన్ను నదలించే వారము
(॥॥)
నీమాఁటలవల్లనే నీవు రవ్వైతివి గాక
యేమీ ననకూరకుంటే నెఱిఁగేరా
వాములైన నీ చేఁతలవల్లఁ గాకైతివి గాక
చేముంచి నేమా కాకుసేసేటి వారము
(॥॥)
కోరి నవ్వి నీవే తెచ్చుకొంటివి గాక యీరట్టు
నేరుపుతో నుంటే నిన్ను నిందలాడేరా
సారె నీబెదరుఁ జూపే సందేహలెత్తించెఁ గాక
సారసాన నేమా నిన్ను చండిసేసే వారము
(॥॥)
రాఁపుగఁ జెనకి నీవే రతికెక్కితివి గాక
పైపై సరసమాడితే పచ్చిసేసేరా
యేపున శ్రీవేంకటేశ యేలితివలమేల్మంగ
నీపనేకాక నేమా యింత సేసే వారము
(||pallavi||)
mammela dūrevu nīvu mām̐ṭimām̐ṭigi
ammaro nemā ninnu nadaliṁche vāramu
(||||)
nīmām̐ṭalavallane nīvu ravvaidivi gāga
yemī nanagūraguṁṭe nĕṟim̐gerā
vāmulaina nī sem̐talavallam̐ gāgaidivi gāga
semuṁchi nemā kāguseseḍi vāramu
(||||)
kori navvi nīve tĕchchugŏṁṭivi gāga yīraṭṭu
nerubudo nuṁṭe ninnu niṁdalāḍerā
sārĕ nībĕdarum̐ jūbe saṁdehalĕttiṁchĕm̐ gāga
sārasāna nemā ninnu saṁḍisese vāramu
(||||)
rām̐pugam̐ jĕnagi nīve radigĕkkidivi gāga
paibai sarasamāḍide pachchiseserā
yebuna śhrīveṁkaḍeśha yelidivalamelmaṁga
nībanegāga nemā yiṁta sese vāramu