(॥పల్లవి॥)
మంకుఁదనంబులు మానఁగదే
సంకె దీరె నిఁకఁ జలమేలే
(॥మంకు॥)
కంటక మాడక కాఁకలు చల్లక
నంటునఁ బతితో నవ్వఁగదే
జంటనుం డాతఁడు చనవులు నెరపఁగ
దంటతనంబులు తగునటవే
(॥మంకు॥)
మనసులు చూడక మచ్చరించ కిటు
ననుపునఁ గవకవ నవ్వఁగదే
యెనయుచుఁ బాయక యెదుటనె వున్నాఁడు
చెనకుల కసరులు చెల్లునటే
(॥మంకు॥)
కుటిలము చూపక గుట్టున నుండక
నటనల సెలవుల నవ్వఁ గదే
యిటునటు శ్రీవేంకటేశుఁడు గూడెను
అటమటములు మఱి యమరునటే
(||pallavi||)
maṁkum̐danaṁbulu mānam̐gade
saṁkĕ dīrĕ nim̐kam̐ jalamele
(||maṁku||)
kaṁṭaga māḍaga kām̐kalu sallaga
naṁṭunam̐ badido navvam̐gade
jaṁṭanuṁ ḍādam̐ḍu sanavulu nĕrabam̐ga
daṁṭadanaṁbulu tagunaḍave
(||maṁku||)
manasulu sūḍaga machchariṁcha kiḍu
nanubunam̐ gavagava navvam̐gade
yĕnayusum̐ bāyaga yĕduḍanĕ vunnām̐ḍu
sĕnagula kasarulu sĕllunaḍe
(||maṁku||)
kuḍilamu sūbaga guṭṭuna nuṁḍaga
naḍanala sĕlavula navvam̐ gade
yiḍunaḍu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnu
aḍamaḍamulu maṟi yamarunaḍe