Mamkumdana memidigi maguvalagu

మంకుఁదన మేమిటికి మగువలకు
Language

(॥పల్లవి॥)
మంకుఁదన మేమిటికి మగువలకు
అంకెకు వచ్చి యిచ్చకమాడరాదా యిపుడు

(॥మంకుఁ॥)
నేటిపతితో మాకు నగక వుండితేను
యెగసక్కెమై వుండదా యెవ్వరికైనా
వెగటేమి గలిగినా వెనక సాదింతుగాని
మొగము చూపి చేయెత్తి మొక్కరాదా యిపుడు

(॥మంకుఁ॥)
పలుమారుఁ బిలువఁగఁ బలుకకవుండితేను
అలిగినట్టుండదా అందరికిని
మలసి నీచలమెల్లా మాపు చూపుదువుగాని
యెలమిఁ జేతికి వీడెమియ్యరాదా యిపుడు

(॥మంకుఁ॥)
ఆతఁడు గాఁగిలించఁగా నట్టె కాఁగిలించకుంటే
యేతులని యెంచరా యింతులెల్లాను
యీతల శ్రీవేంకటేశు నింకాఁ గూడుదువుగాని
చేతనైనపాటి సేవసేయరాదా యిపుడు

(||pallavi||)
maṁkum̐dana memiḍigi maguvalagu
aṁkĕgu vachchi yichchagamāḍarādā yibuḍu

(||maṁkum̐||)
neḍibadido māgu nagaga vuṁḍidenu
yĕgasakkĕmai vuṁḍadā yĕvvarigainā
vĕgaḍemi galiginā vĕnaga sādiṁtugāni
mŏgamu sūbi seyĕtti mŏkkarādā yibuḍu

(||maṁkum̐||)
palumārum̐ biluvam̐gam̐ balugagavuṁḍidenu
aliginaṭṭuṁḍadā aṁdarigini
malasi nīsalamĕllā mābu sūbuduvugāni
yĕlamim̐ jedigi vīḍĕmiyyarādā yibuḍu

(||maṁkum̐||)
ādam̐ḍu gām̐giliṁcham̐gā naṭṭĕ kām̐giliṁchaguṁṭe
yedulani yĕṁcharā yiṁtulĕllānu
yīdala śhrīveṁkaḍeśhu niṁkām̐ gūḍuduvugāni
sedanainabāḍi sevaseyarādā yibuḍu