Mamkumdana mede naagu maguvalaala

మంకుఁదన మేదే నాకు మగువలాల
Language

(॥పల్లవి॥)
మంకుఁదన మేదే నాకు మగువలాల
అంకెకుఁ దా నెట్టు చెప్పె నట్టు సేసెనే

(॥మంకుఁ॥)
కపటమున్నదా నాకుఁ గడునెంతైనాఁ దనపై
అపుడే మరచితి నే నట్టికోపము
వుపమలఁదా నేఁటికి నొడఁబరచీనే నన్ను
తపముతో నున్న దాన తనకొరకే

(॥మంకుఁ॥)
చలము సాదించేనటే సారెసారెఁ దనతోను
చెలఁగి తనవోజలు చెప్పితి నింతే
పలుమారుఁదా నేఁటికిపంతము లిచ్చీ నాకు
వలచి యెప్పుడుఁ దనవసమై యుందానను

(॥మంకుఁ॥)
కాదనేనటే తన్ను కాఁగిలించి కూడె నన్ను
సోదించి చూచితి నాఁడే సొంపులెల్లాను
యీదెస శ్రీవేంకటేశుఁ డింతగా మన్నించె నన్ను
మోదముతో నున్న దాన మొదలనుండియును

(||pallavi||)
maṁkum̐dana mede nāgu maguvalāla
aṁkĕgum̐ dā nĕṭṭu sĕppĕ naṭṭu sesĕne

(||maṁkum̐||)
kabaḍamunnadā nāgum̐ gaḍunĕṁtainām̐ danabai
abuḍe marasidi ne naṭṭigobamu
vubamalam̐dā nem̐ṭigi nŏḍam̐barasīne nannu
tabamudo nunna dāna tanagŏrage

(||maṁkum̐||)
salamu sādiṁchenaḍe sārĕsārĕm̐ danadonu
sĕlam̐gi tanavojalu sĕppidi niṁte
palumārum̐dā nem̐ṭigibaṁtamu lichchī nāgu
valasi yĕppuḍum̐ danavasamai yuṁdānanu

(||maṁkum̐||)
kādanenaḍe tannu kām̐giliṁchi kūḍĕ nannu
sodiṁchi sūsidi nām̐ḍe sŏṁpulĕllānu
yīdĕsa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtagā manniṁchĕ nannu
modamudo nunna dāna mŏdalanuṁḍiyunu