Mamku vidisina nide mamchi buddi

మంకు విడిచిన నిదె మంచి బుద్ది
Language

(॥పల్లవి॥)
మంకు విడిచిన నిదె మంచి బుద్ది
సుంకుల మీలోనే మీరు చూచుకొనరాదా

(॥॥)
నీడలెల్ల నెండలాయ నెలఁత నీవు రాకున్న
వేడుకెల్లా వేసటాయ వెచ్చఁదనాన
వాడిక నడుమ వేరే, వయసు రిత్తవోయీని
కూడిన కూటాలమేలు కొల్లలాడరాదా

(॥॥)
కప్పురమే కారమాయ కగిసేమాటలు లేక
దప్పులెల్లాఁ దనివాయ దగ్గరి రాఁగా
రెప్పవే సేయంతలోనే రేసులెక్కు నీ మనసు
తెప్పలఁ దేలఁగరాదా దిష్టపుమీరతుల

(॥॥)
దవ్వులెల్లఁ జేరువాయఁ దరుణి మీవియ్యకోఁగా
పువ్వులెల్లఁ బిందెలాయఁ బూఁటపూఁటకు
యివ్వల శ్రీ వేంకటేశ యింతి నీవు గూడఁగాను
నవ్వులాయ మాకెల్ల నమ్మికియ్యరాదా

(||pallavi||)
maṁku viḍisina nidĕ maṁchi buddi
suṁkula mīlone mīru sūsugŏnarādā

(||||)
nīḍalĕlla nĕṁḍalāya nĕlam̐ta nīvu rāgunna
veḍugĕllā vesaḍāya vĕchcham̐danāna
vāḍiga naḍuma vere, vayasu rittavoyīni
kūḍina kūḍālamelu kŏllalāḍarādā

(||||)
kappurame kāramāya kagisemāḍalu lega
dappulĕllām̐ danivāya daggari rām̐gā
rĕppave seyaṁtalone resulĕkku nī manasu
tĕppalam̐ delam̐garādā diṣhṭabumīradula

(||||)
davvulĕllam̐ jeruvāyam̐ daruṇi mīviyyagom̐gā
puvvulĕllam̐ biṁdĕlāyam̐ būm̐ṭabūm̐ṭagu
yivvala śhrī veṁkaḍeśha yiṁti nīvu gūḍam̐gānu
navvulāya māgĕlla nammigiyyarādā