Mamdemelame naagu mannimtuvu gaana needo

మందెమేళమె నాకు మన్నింతువు గాన నీతో
Language

(॥పల్లవి॥)
మందెమేళమె నాకు మన్నింతువు గాన నీతో
యిందుకుఁగా నీవు యెగ్గు లెంచకుమీ అయ్యా

(॥మందె॥)
వాలుకరెప్పల వంచి వడి నేఁ గొసరితిని
తాలిమి లేక నీపైఁ దమకించితి
వేళావే ళెరఁగక వేసరించితిని నిన్ను
యీలీల నీచిత్త మెట్టో యెరఁగఁజుమ్మీ అయ్య

(॥మందె॥)
కుచ్చి కుచ్చి నిన్ను సారె గుబ్బల నే నొత్తితిని
తచ్చి తచ్చి నోతోఁ బంతము లాడితి
హెచ్చుగా సెలవి నిన్ను నిందరిలో నవ్వితిని
మచ్చట నిన్నిటికిగా మొక్కెఁ జుమ్మీ అయ్యా

(॥మందె॥)
పాయపుమదాన నిన్నుఁ బట్టి చేతఁ దీసితిని
చాయల సన్నల నిన్ను జంకించితి
ఆయ మెరఁగక నిన్ను నలయించి కూడితిని
మాయల శ్రీవెంకటేశ మానఁ జుమ్మీ అయ్యా

(||pallavi||)
maṁdĕmeḽamĕ nāgu manniṁtuvu gāna nīdo
yiṁdugum̐gā nīvu yĕggu lĕṁchagumī ayyā

(||maṁdĕ||)
vālugarĕppala vaṁchi vaḍi nem̐ gŏsaridini
tālimi lega nībaim̐ damagiṁchidi
veḽāve ḽĕram̐gaga vesariṁchidini ninnu
yīlīla nīsitta mĕṭṭo yĕram̐gam̐jummī ayya

(||maṁdĕ||)
kuchchi kuchchi ninnu sārĕ gubbala ne nŏttidini
tachchi tachchi nodom̐ baṁtamu lāḍidi
hĕchchugā sĕlavi ninnu niṁdarilo navvidini
machchaḍa ninniḍigigā mŏkkĕm̐ jummī ayyā

(||maṁdĕ||)
pāyabumadāna ninnum̐ baṭṭi sedam̐ dīsidini
sāyala sannala ninnu jaṁkiṁchidi
āya mĕram̐gaga ninnu nalayiṁchi kūḍidini
māyala śhrīvĕṁkaḍeśha mānam̐ jummī ayyā