మందెమేళమైన మీఁద మరి చెప్ప నేఁటికి
(॥పల్లవి॥)
మందెమేళమైన మీఁద మరి చెప్ప నేఁటికి
అందెవ్వతెతో నవ్వినా అదలించీ నిన్నును
(॥మందె॥)
చెనకి నీవు నవ్వఁగా సిగ్గువడెఁ గాక చెలి
మునుపటివలె నుంటే మొక్కదా నీకు
చనవు నీవియ్యఁగానె సంగడిఁ గూచుండెఁ గాక
పనులు సేయించుకొంటే బత్తితోడఁ జేయదా
(॥మందె॥)
మట్టులేక వలవఁగా మంచముపై నుండెఁ గాక
గుట్టున నుండితే నీకుఁ గొలువు సేయదా
నెట్టన నొడి వట్టఁగా ని న్నింత జంకించెఁ గాక
అట్టే వోరచుకుంటేఁ బ్రియము నీకుఁ జెప్పదా
(॥మందె॥)
పైపైఁ గూడఁగా నీమై పచ్చిసేసెఁ గాక తరి-
తీపు సేసితే వడఁదేర్చదా నిన్ను
యేపున శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
చేపట్టి నన్నేలి తాపె చేరి బుద్ది చెప్పదా
(||pallavi||)
maṁdĕmeḽamaina mīm̐da mari sĕppa nem̐ṭigi
aṁdĕvvadĕdo navvinā adaliṁchī ninnunu
(||maṁdĕ||)
sĕnagi nīvu navvam̐gā sigguvaḍĕm̐ gāga sĕli
munubaḍivalĕ nuṁṭe mŏkkadā nīgu
sanavu nīviyyam̐gānĕ saṁgaḍim̐ gūsuṁḍĕm̐ gāga
panulu seyiṁchugŏṁṭe battidoḍam̐ jeyadā
(||maṁdĕ||)
maṭṭulega valavam̐gā maṁchamubai nuṁḍĕm̐ gāga
guṭṭuna nuṁḍide nīgum̐ gŏluvu seyadā
nĕṭṭana nŏḍi vaṭṭam̐gā ni nniṁta jaṁkiṁchĕm̐ gāga
aṭṭe vorasuguṁṭem̐ briyamu nīgum̐ jĕppadā
(||maṁdĕ||)
paibaim̐ gūḍam̐gā nīmai pachchisesĕm̐ gāga tari-
tību seside vaḍam̐dersadā ninnu
yebuna śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
sebaṭṭi nanneli tābĕ seri buddi sĕppadā