మందెమేళమై నీవు మన్నించరాఁగాను
(॥పల్లవి॥)
మందెమేళమై నీవు మన్నించరాఁగాను
యెందుకనీ విన్నవించే నీడ నుండేనయ్యా
(॥మందె॥)
మంతనములాడఁగానే మరి దగ్గరవచ్చునా
ఇంటనుండేదేమేలు ఇద్దరికిని
చెంతల నప్పటి నిన్ను చేఇ దాఁకించవచ్చునా
వింతలుగా నాకు నీవు విడెమియ్యఁగాను
(॥మందె॥)
నవ్వులు మీరు నవ్వఁగా నడుము చొరవచ్చునా
వువ్విళ్లూర గుట్టుతోడ నుండుటే రీతి
జవ్వనమదముసోక చన్నులంటించవచ్చునా
పువ్వులు ముడువుమని పొందు సేయఁగాను
(॥మందె॥)
ఇట్టె మీరు గూడుండఁగ నెఱిఁగించుకోవచ్చునా
చుట్టుక మీవారమై మెచ్చుటే మేలు
రట్టుగా శ్రీవేంకటేశ ఇట్టె యాడుకోవచ్చునా
జట్టిగొనందుకు నీవు సన్న సేయఁగను
(||pallavi||)
maṁdĕmeḽamai nīvu manniṁcharām̐gānu
yĕṁduganī vinnaviṁche nīḍa nuṁḍenayyā
(||maṁdĕ||)
maṁtanamulāḍam̐gāne mari daggaravachchunā
iṁṭanuṁḍedemelu iddarigini
sĕṁtala nappaḍi ninnu sei dām̐kiṁchavachchunā
viṁtalugā nāgu nīvu viḍĕmiyyam̐gānu
(||maṁdĕ||)
navvulu mīru navvam̐gā naḍumu sŏravachchunā
vuvviḽlūra guṭṭudoḍa nuṁḍuḍe rīdi
javvanamadamusoga sannulaṁṭiṁchavachchunā
puvvulu muḍuvumani pŏṁdu seyam̐gānu
(||maṁdĕ||)
iṭṭĕ mīru gūḍuṁḍam̐ga nĕṟim̐giṁchugovachchunā
suṭṭuga mīvāramai mĕchchuḍe melu
raṭṭugā śhrīveṁkaḍeśha iṭṭĕ yāḍugovachchunā
jaṭṭigŏnaṁdugu nīvu sanna seyam̐ganu