Mamdemela mimtayele maganidonu

మందెమేళ మింతయేలే మగనితోను
Language

(॥పల్లవి॥)
మందెమేళ మింతయేలే మగనితోను
చెంది యిచ్చకములెల్లాఁ జేయవలెఁగాక

(॥మందె॥)
చెంతనుండి రమణుఁడు చెప్పి చెప్పి పంపఁగాను
యెంత సింగారించుకొనే వెందాఁగానే
అంతేపో వోయమ్మ అద్దమేమి చూచేవే
దొంతివలపుల నీకెదురుచూచీ నతఁడు

(॥మందె॥)
సరసుఁడు మేడలెక్కి సన్నలెల్లాఁ జేయఁగాను
సరు లేమి దిద్దేవే సారె సారెకు
సరవెరఁగవు రాజసములనే పొరలేవు
మరిగి నీతోడి పొందే మతిఁగోరీ నతఁడు

(॥మందె॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చేవట్టి పెనఁగఁగా
మోవి నేమి మాఁటాడేవే మొక్కుమొక్కీవే
నీవు నాతఁడునుఁ గూడి నెమ్మది నిట్టె వుండితే
కైవసమై నీకెపపుడూఁ గాణాచాయ నతఁడు

(||pallavi||)
maṁdĕmeḽa miṁtayele maganidonu
sĕṁdi yichchagamulĕllām̐ jeyavalĕm̐gāga

(||maṁdĕ||)
sĕṁtanuṁḍi ramaṇum̐ḍu sĕppi sĕppi paṁpam̐gānu
yĕṁta siṁgāriṁchugŏne vĕṁdām̐gāne
aṁtebo voyamma addamemi sūseve
dŏṁtivalabula nīgĕdurusūsī nadam̐ḍu

(||maṁdĕ||)
sarasum̐ḍu meḍalĕkki sannalĕllām̐ jeyam̐gānu
saru lemi diddeve sārĕ sārĕgu
saravĕram̐gavu rājasamulane pŏralevu
marigi nīdoḍi pŏṁde madim̐gorī nadam̐ḍu

(||maṁdĕ||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu sevaṭṭi pĕnam̐gam̐gā
movi nemi mām̐ṭāḍeve mŏkkumŏkkīve
nīvu nādam̐ḍunum̐ gūḍi nĕmmadi niṭṭĕ vuṁḍide
kaivasamai nīgĕbabuḍūm̐ gāṇāsāya nadam̐ḍu