మండాటా లిఁకనేల మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మండాటా లిఁకనేల మాపు దాఁకాను
వుండినయట్లనే వొనగూడుమనవే
(॥మండా॥)
మనసులోకపటాలు మతకరిమాటలు
కనుఁగొన్నయప్పుడే కానరాదా
తనకేఁటియానలు తగదనే వారెవ్వరు
మనలోచుట్టరికాన మన్నించుమనవే
(॥మండా॥)
తిరిగేటితిమ్మటలు తెమలనివేసాలు
గరువపునవ్వులోనే కానరాదా
సిరినేల వొడఁబాటు చాలున(చెల్లద?) నేవారెవ్వరు
కరుణగలిగినట్టే కయికొనుమనవే
(॥మండా॥)
రాఁగినచలములు రమించేవలపులు
కాఁగిటిలోననే కానరాదా
మాఁగఁబెట్టనేల మోవి మరిగి నన్నిటు గూడె
దాఁగక శ్రీవేంకటేశు దయఁజూడమనవే
(||pallavi||)
maṁḍāḍā lim̐kanela mābu dām̐kānu
vuṁḍinayaṭlane vŏnagūḍumanave
(||maṁḍā||)
manasulogabaḍālu madagarimāḍalu
kanum̐gŏnnayappuḍe kānarādā
tanagem̐ṭiyānalu tagadane vārĕvvaru
manalosuṭṭarigāna manniṁchumanave
(||maṁḍā||)
tirigeḍidimmaḍalu tĕmalanivesālu
garuvabunavvulone kānarādā
sirinela vŏḍam̐bāḍu sāluna(sĕllada?) nevārĕvvaru
karuṇagaliginaṭṭe kayigŏnumanave
(||maṁḍā||)
rām̐ginasalamulu ramiṁchevalabulu
kām̐giḍilonane kānarādā
mām̐gam̐bĕṭṭanela movi marigi nanniḍu gūḍĕ
dām̐gaga śhrīveṁkaḍeśhu dayam̐jūḍamanave