Mamchivaayam banulellaa madumgulo mailalele

మంచివాయఁ బనులెల్లా మడుఁగులో మైలలేలే
Language

(॥పల్లవి॥)
మంచివాయఁ బనులెల్లా మడుఁగులో మైలలేలే
నించి నించి నీ మగఁడు నీతో నవ్వఁగాను

(॥మంచి॥)
బొమ్మల విండ్లేమిటికి పూఁచి యెక్కువేట్టేవే
కుమ్మరింపుఁజూపులనే గురుతులేల యేసేవే
వుమ్మగిలునిష్టూరము లొడిఁగట్టుకొననేలే
వుమ్మడి నీతఁడు నిన్ను నొడఁబరచఁగాను

(॥మంచి॥)
మాటల కత్తు లేఁటికి మరి యెంత నూరేవే
చాటు వెట్టుక గుబ్బల సాము లెందాఁకాఁ జేసేవే
గాఁటపుచలము లింత గాదెఁ బోసుకోనేలే
కూటమి కితఁడు వేఁడుకొని కొసరఁగను

(॥మంచి॥)
సిగ్గుల యరిగె లేల చేరి చాటు వెట్టేవే
బగ్గనఁ దమకముల పౌఁజు లెంత చూపేవే
వొగ్గి కాఁగిటిలోఁ బంతా లూరకే నెరపనేలే
యెగ్గులేక శ్రీవేంకటేశుఁడు నిన్నేలఁగాను

(||pallavi||)
maṁchivāyam̐ banulĕllā maḍum̐gulo mailalele
niṁchi niṁchi nī magam̐ḍu nīdo navvam̐gānu

(||maṁchi||)
bŏmmala viṁḍlemiḍigi pūm̐si yĕkkuveṭṭeve
kummariṁpum̐jūbulane gurudulela yeseve
vummagiluniṣhṭūramu lŏḍim̐gaṭṭugŏnanele
vummaḍi nīdam̐ḍu ninnu nŏḍam̐barasam̐gānu

(||maṁchi||)
māḍala kattu lem̐ṭigi mari yĕṁta nūreve
sāḍu vĕṭṭuga gubbala sāmu lĕṁdām̐kām̐ jeseve
gām̐ṭabusalamu liṁta gādĕm̐ bosugonele
kūḍami kidam̐ḍu vem̐ḍugŏni kŏsaram̐ganu

(||maṁchi||)
siggula yarigĕ lela seri sāḍu vĕṭṭeve
bagganam̐ damagamula paum̐ju lĕṁta sūbeve
vŏggi kām̐giḍilom̐ baṁtā lūrage nĕrabanele
yĕggulega śhrīveṁkaḍeśhum̐ḍu ninnelam̐gānu