Mamchivaanivalene maadalu naadevu gaaga

మంచివానివలెనె మాటలు నాడేవు గాక
Language

(॥పల్లవి॥)
మంచివానివలెనె మాటలు నాడేవు గాక
దించరాని తమకపు దేవరవు గావా

(॥మంచివాని॥)
గుట్టున నెవ్వతెమీఁది కోపాన వచ్చి య దెల్ల
వెట్టికి నింటివారిపై వెళ్ళించేవు
దిట్ట నే నొకతెఁ గాఁగా దో కొంటిఁ గాక నీతో
అట్టిపాటి యాఁట దెల్లా నండకు రాఁగలదా

(॥మంచివాని॥)
బిగిసి యాడ నెవ్వతే పిలువనికాంతాళన
నగుతా నెవ్వరే మనినాఁ దిట్టేవు
అగపడి నేఁ గాఁగా నన్నియు నమరెఁ గాక
నిగిడి వేరొక్క తై తే నీతోఁ బొందు సేసునా

(॥మంచి॥)
ఆవల నెవ్వతెతోను అలిగినవాఁడవై
కవ గూడి నన్ను నిట్టె కాఁక సేసేవు
నవ మై శ్రీవెంకటేశ నాకె మజ్జాతి గాక
నివిరి వేరొక్క తై తే నీతోఁ బిందు సేసునా

(||pallavi||)
maṁchivānivalĕnĕ māḍalu nāḍevu gāga
diṁcharāni tamagabu devaravu gāvā

(||maṁchivāni||)
guṭṭuna nĕvvadĕmīm̐di kobāna vachchi ya dĕlla
vĕṭṭigi niṁṭivāribai vĕḽḽiṁchevu
diṭṭa ne nŏgadĕm̐ gām̐gā do kŏṁṭim̐ gāga nīdo
aṭṭibāḍi yām̐ṭa dĕllā naṁḍagu rām̐galadā

(||maṁchivāni||)
bigisi yāḍa nĕvvade piluvanigāṁtāḽana
nagudā nĕvvare maninām̐ diṭṭevu
agabaḍi nem̐ gām̐gā nanniyu namarĕm̐ gāga
nigiḍi verŏkka tai te nīdom̐ bŏṁdu sesunā

(||maṁchi||)
āvala nĕvvadĕdonu aliginavām̐ḍavai
kava gūḍi nannu niṭṭĕ kām̐ka sesevu
nava mai śhrīvĕṁkaḍeśha nāgĕ majjādi gāga
niviri verŏkka tai te nīdom̐ biṁdu sesunā