(॥పల్లవి॥)
మంచివానివలెనే మాటలాడీనే
యించుకంతా నెఱుఁగడు యేడవాఁడే తాను
(॥మంచి॥)
తీపులపెదవి వంచి తిట్టినా మానఁ డే నేఁ
గోపగించుకొనఁగానే కొల్లున నవ్వీనే
రాపుగా నాసలువెట్టి రాకుమన్నా మానఁడే
వోపనని రాఁగా నావొద్దికి వచ్చీనే
(॥మంచి॥)
గొణఁగి గొణఁగి లోలో గుంపించినా మానఁడే
అణఁగి నిద్దిరించఁగా నాయ మంటీనే
వొణకెవేసుక నే నూరకున్నా మానఁడే
సణఁగులాడఁగ వేరే సాకిరివెట్టీనే
(॥మంచి॥)
వెఱతు మనుచు మొక్కి వేసరినా మానఁడే
కఱకులాడేవేళ కౌఁగిలించీనే
వుఱక శ్రీవేంకటాద్రినుండి వచ్చి నన్నుఁ గూడె
మొఱఁగి వావిలిపాటి ముద్దురామచంద్రుఁడే
(||pallavi||)
maṁchivānivalĕne māḍalāḍīne
yiṁchugaṁtā nĕṟum̐gaḍu yeḍavām̐ḍe tānu
(||maṁchi||)
tībulabĕdavi vaṁchi tiṭṭinā mānam̐ ḍe nem̐
gobagiṁchugŏnam̐gāne kŏlluna navvīne
rābugā nāsaluvĕṭṭi rāgumannā mānam̐ḍe
vobanani rām̐gā nāvŏddigi vachchīne
(||maṁchi||)
gŏṇam̐gi gŏṇam̐gi lolo guṁpiṁchinā mānam̐ḍe
aṇam̐gi niddiriṁcham̐gā nāya maṁṭīne
vŏṇagĕvesuga ne nūragunnā mānam̐ḍe
saṇam̐gulāḍam̐ga vere sāgirivĕṭṭīne
(||maṁchi||)
vĕṟadu manusu mŏkki vesarinā mānam̐ḍe
kaṟagulāḍeveḽa kaum̐giliṁchīne
vuṟaga śhrīveṁkaḍādrinuṁḍi vachchi nannum̐ gūḍĕ
mŏṟam̐gi vāvilibāḍi muddurāmasaṁdrum̐ḍe