Mamchivaamdavuvalene madagamulu sesevu

మంచివాఁడవువలెనే మతకములు సేసేవు
Language

(॥పల్లవి॥)
మంచివాఁడవువలెనే మతకములు సేసేవు
అంచెలనే పైకొనే వవునయ్యా నీవు

(॥॥)
చీర లెస్సాయనంటాను చెరఁగువట్టి తీసేవు
హారములు చూచేనంటా నంటేవు చన్నులు
తీరాయఁ గమ్మలనుచు గోర గీరేవు చెక్కులు
ఆరీతి నింతసేతురా ఆంగనలను

(॥॥)
వుంగరాలు మంచివంటా నూరకే వేలువట్టేవు
సింగారమాయఁ గొప్పంటా జేయిచాఁచేవు
సంగతాయఁ గుచ్చలంటా సరుగ నొడివట్టేవు
చెంగటఁ గాకు సేతురా చెలువలను

(॥॥)
మోవిపండు తీపులంటా ముంచి చవులు రేఁచేవు
శ్రీవేంకటేశుఁడ నన్నుఁ జేరి కూడేవు
ఆవల నలమేల్మంగనని నన్నుఁ బొగడేవు
భావించి సచ్చినేతురా పడఁతులను

(||pallavi||)
maṁchivām̐ḍavuvalĕne madagamulu sesevu
aṁchĕlane paigŏne vavunayyā nīvu

(||||)
sīra lĕssāyanaṁṭānu sĕram̐guvaṭṭi tīsevu
hāramulu sūsenaṁṭā naṁṭevu sannulu
tīrāyam̐ gammalanusu gora gīrevu sĕkkulu
ārīdi niṁtasedurā āṁganalanu

(||||)
vuṁgarālu maṁchivaṁṭā nūrage veluvaṭṭevu
siṁgāramāyam̐ gŏppaṁṭā jeyisām̐sevu
saṁgadāyam̐ guchchalaṁṭā saruga nŏḍivaṭṭevu
sĕṁgaḍam̐ gāgu sedurā sĕluvalanu

(||||)
movibaṁḍu tībulaṁṭā muṁchi savulu rem̐sevu
śhrīveṁkaḍeśhum̐ḍa nannum̐ jeri kūḍevu
āvala nalamelmaṁganani nannum̐ bŏgaḍevu
bhāviṁchi sachchinedurā paḍam̐tulanu