(॥పల్లవి॥)
మంచివాఁడవంతే పో మాధవరాయా
మంచుమాయ మాఁడుకూరి మాధవరాయా
(॥మంచి॥)
మోనాననుండిననన్ను ముట్టి వేఁడుకొనేనంటా
మానమేలంటేవోయి మాధవరాయా
నేనా సారెకు వచ్చి నీతో నెదురాడేదాన
మానవుగా మాఁడుకూరి మాధవరాయా
(॥మంచి॥)
యెగసక్యానకే మా ఇల్లుచొచ్చి వచ్చేవు
మగనాలిఁ గదవోయి మాధవరాయా
బగి వాయక కూచుండి పైఁ దొడవేసేవు నీ-
మగువనా మాఁడుకూరి మాధవరాయా
(॥మంచి॥)
వోపనన్నాఁ బోనీవు వొడివట్టి తీసేవు
మాపుదాఁకానేలోయి మాధవరాయా
కోపుగా శ్రీవేంకటాద్రిఁ గూడి చూపేవా నీయెమ్మె
మాపైనే మాఁడుకూరి మాధవరాయా
(||pallavi||)
maṁchivām̐ḍavaṁte po mādhavarāyā
maṁchumāya mām̐ḍugūri mādhavarāyā
(||maṁchi||)
monānanuṁḍinanannu muṭṭi vem̐ḍugŏnenaṁṭā
mānamelaṁṭevoyi mādhavarāyā
nenā sārĕgu vachchi nīdo nĕdurāḍedāna
mānavugā mām̐ḍugūri mādhavarāyā
(||maṁchi||)
yĕgasakyānage mā illusŏchchi vachchevu
maganālim̐ gadavoyi mādhavarāyā
bagi vāyaga kūsuṁḍi paim̐ dŏḍavesevu nī-
maguvanā mām̐ḍugūri mādhavarāyā
(||maṁchi||)
vobanannām̐ bonīvu vŏḍivaṭṭi tīsevu
mābudām̐kāneloyi mādhavarāyā
kobugā śhrīveṁkaḍādrim̐ gūḍi sūbevā nīyĕmmĕ
mābaine mām̐ḍugūri mādhavarāyā