Mamchivaamda vavuduvu mammum dadavagu saalu

మంచివాఁడ వవుదువు మమ్ముఁ దడవకు చాలు
Language

(॥పల్లవి॥)
మంచివాఁడ వవుదువు మమ్ముఁ దడవకు చాలు
ముంచి నీకు నేపొద్దు మొక్కేము నేను

(॥మంచివాడ॥)
తెగనాడఁ జాలఁ గాక తేనెల నీమాటలకే
ఆగపడి చిక్కరా దైత్యాంగనలు
పగ కోప మింతే కాక పడఁతిఁ జంపినవాని
మగతన మే మున్నది మరతునా నేను

(॥మంచివాడ॥)
యిచ్చకము మానఁ గాక యిట్టె నీ పొందుల సేసి
కొచ్చి మరులు గొనరా గోపికలు
వొచ్చె మిదె నీ కొడుకు వొగిఁ గూడపెట్టఁగాను
తెచ్చుకొంటివి సతుల దేవరవు గావా

(॥మంచివాడు॥)
యింకా నే లని కాక యిట్టి నీకు మోహించి
కొంకక వొక్కతె ముక్కుగోఁతఁ బడదా
లంకె మమ్ము గూడితి వీలాగు మమ్ముఁ జేయకుమీ
అంకెల శ్రీవెంకటేశ అన్నిటా నమ్మితిని

(||pallavi||)
maṁchivām̐ḍa vavuduvu mammum̐ daḍavagu sālu
muṁchi nīgu nebŏddu mŏkkemu nenu

(||maṁchivāḍa||)
tĕganāḍam̐ jālam̐ gāga tenĕla nīmāḍalage
āgabaḍi sikkarā daityāṁganalu
paga koba miṁte kāga paḍam̐tim̐ jaṁpinavāni
magadana me munnadi maradunā nenu

(||maṁchivāḍa||)
yichchagamu mānam̐ gāga yiṭṭĕ nī pŏṁdula sesi
kŏchchi marulu gŏnarā gobigalu
vŏchchĕ midĕ nī kŏḍugu vŏgim̐ gūḍabĕṭṭam̐gānu
tĕchchugŏṁṭivi sadula devaravu gāvā

(||maṁchivāḍu||)
yiṁkā ne lani kāga yiṭṭi nīgu mohiṁchi
kŏṁkaga vŏkkadĕ mukkugom̐tam̐ baḍadā
laṁkĕ mammu gūḍidi vīlāgu mammum̐ jeyagumī
aṁkĕla śhrīvĕṁkaḍeśha anniḍā nammidini