Mamchivaamda vauduvayyaa maanavu nee bemtamu

మంచివాఁడ వౌదువయ్యా మానవు నీ బేఁటము
Language

(॥పల్లవి॥)
మంచివాఁడ వౌదువయ్యా మానవు నీ బేఁటము
నించి నే మొకటిసేయ నీ వొకటి సేసేవు

(॥మంచి॥)
కొలువు సేసి యలసి కొమ్మ పవ్వళించితేను
చెలులము పాదాలొత్తి సేవసేయఁగా
చెలఁగి అంతలో వచ్చి సేదదేరిచేనంటా
పెలుచుఁజన్నులు వట్టి పిసికేవు నీవు

(॥మంచి॥)
మఱి నీతోఁ బెనఁగి కోమలి యాఁకలిగొంటే
చెఱకుఁబిచ్చెలు నేము చేతనియ్యఁగా
నెఱి నంతలో వచ్చి నేను తోడయ్యేనంటా
మొఱఁగి మోవి తీపు మోవి కందిచ్చేవు

(॥మంచి॥)
ఇన్నిటా నిన్నుఁ గూడి ఇంతి జలకమాడితే
కన్నెలము తడిసూళ్ళు కడునొత్తఁగా
సన్నల నంతలో వచ్చి సందడి శ్రీవేంకటేశ
వున్నతపుకొనగోర నొత్తేవు నీవు

(||pallavi||)
maṁchivām̐ḍa vauduvayyā mānavu nī bem̐ṭamu
niṁchi ne mŏgaḍiseya nī vŏgaḍi sesevu

(||maṁchi||)
kŏluvu sesi yalasi kŏmma pavvaḽiṁchidenu
sĕlulamu pādālŏtti sevaseyam̐gā
sĕlam̐gi aṁtalo vachchi sedaderisenaṁṭā
pĕlusum̐jannulu vaṭṭi pisigevu nīvu

(||maṁchi||)
maṟi nīdom̐ bĕnam̐gi komali yām̐kaligŏṁṭe
sĕṟagum̐bichchĕlu nemu sedaniyyam̐gā
nĕṟi naṁtalo vachchi nenu toḍayyenaṁṭā
mŏṟam̐gi movi tību movi kaṁdichchevu

(||maṁchi||)
inniḍā ninnum̐ gūḍi iṁti jalagamāḍide
kannĕlamu taḍisūḽḽu kaḍunŏttam̐gā
sannala naṁtalo vachchi saṁdaḍi śhrīveṁkaḍeśha
vunnadabugŏnagora nŏttevu nīvu