మంచివాఁడ వౌదువయ్యా మాటలేఁటికి
(॥పల్లవి॥)
మంచివాఁడ వౌదువయ్యా మాటలేఁటికి
వంచిన నా తురుమెల్ల వదలఁదీసితివి
(॥మంచి॥)
వాడిననీమోము చూచి వద్దికి నే వచ్చితేను
వీడెమిచ్చే వంతలోనే వేగిరానను
వోడక దొరవంటాను వుపచారము చూపితే
యీడుగా నమోవెల్లా నెంగిలిసేసితివి
(॥మంచి॥)
వొంటి నీ వున్నాఁడవంటా వూరకె తోడుండఁగాను
అంటి నన్నుఁ బైకొనేవు అవునయ్య నీవు
జంటైనచుట్టరికాన సహాయమునెరపితే
గెంటక వాచీరగిజిగిజిగాఁ జేసితివి
(॥మంచి॥)
నిద్దిరింతువోయని నేఁ దొడ చెఱచితేను
గద్దించి కాఁగిటనన్నుఁ గలసితివి
అద్దో శ్రీవేంకటేశ అన్నిటా మొగమోడితే
వుద్దండపురతులలో నోలలాడించితివి
(||pallavi||)
maṁchivām̐ḍa vauduvayyā māḍalem̐ṭigi
vaṁchina nā turumĕlla vadalam̐dīsidivi
(||maṁchi||)
vāḍinanīmomu sūsi vaddigi ne vachchidenu
vīḍĕmichche vaṁtalone vegirānanu
voḍaga dŏravaṁṭānu vubasāramu sūbide
yīḍugā namovĕllā nĕṁgilisesidivi
(||maṁchi||)
vŏṁṭi nī vunnām̐ḍavaṁṭā vūragĕ toḍuṁḍam̐gānu
aṁṭi nannum̐ baigŏnevu avunayya nīvu
jaṁṭainasuṭṭarigāna sahāyamunĕrabide
gĕṁṭaga vāsīragijigijigām̐ jesidivi
(||maṁchi||)
niddiriṁtuvoyani nem̐ dŏḍa sĕṟasidenu
gaddiṁchi kām̐giḍanannum̐ galasidivi
addo śhrīveṁkaḍeśha anniḍā mŏgamoḍide
vuddaṁḍaburadulalo nolalāḍiṁchidivi