Mamchivaamda vauduvayya maguva nimta yemturaa

మంచివాఁడ వౌదువయ్య మగువ నింత యేఁతురా
Language

(॥పల్లవి॥)
మంచివాఁడ వౌదువయ్య మగువ నింత యేఁతురా
అంచెల నిప్పుడే నీవు ఆదరించవలదా

(॥మంచి॥)
మగవాఁ డేమిసేసినా మాటలే పెంతురుగాక
తగవులఁబెట్టుదురా తరుణులు
సొగిసి నీ వెంతేసిజూజగాఁడవై నాను
తగులువిరిపందేలు తరుణు తాడుదురా

(॥మంచి॥)
చలము సాదించేవానిజంకింతురు గాక
బలువులు చూపుదురా పడఁతులు
వెలలేనివలపులవేఁటకాఁడవు నీవైతే
చలివాసి తమగాలు సకియ లెక్కుదురా

(॥మంచి॥)
చేవలు మీరినవానిఁ జేవట్టి తీతురుగాక
వావాతఁ దిట్టుదురా వనితలు
శ్రీవేంకటేశ యీపెనుచేరి నీవెంత గూడినా
కావిరిఁ దమగుట్లు కాంతలు చెప్పుదురా

(||pallavi||)
maṁchivām̐ḍa vauduvayya maguva niṁta yem̐turā
aṁchĕla nippuḍe nīvu ādariṁchavaladā

(||maṁchi||)
magavām̐ ḍemisesinā māḍale pĕṁturugāga
tagavulam̐bĕṭṭudurā taruṇulu
sŏgisi nī vĕṁtesijūjagām̐ḍavai nānu
taguluviribaṁdelu taruṇu tāḍudurā

(||maṁchi||)
salamu sādiṁchevānijaṁkiṁturu gāga
baluvulu sūbudurā paḍam̐tulu
vĕlalenivalabulavem̐ṭagām̐ḍavu nīvaide
salivāsi tamagālu sagiya lĕkkudurā

(||maṁchi||)
sevalu mīrinavānim̐ jevaṭṭi tīdurugāga
vāvādam̐ diṭṭudurā vanidalu
śhrīveṁkaḍeśha yībĕnuseri nīvĕṁta gūḍinā
kāvirim̐ damaguṭlu kāṁtalu sĕppudurā