Mamchivaamda vauduvayya maanini adumdamgaanu

మంచివాఁడ వౌదువయ్య మానిని అటుండఁగాను
Language

(॥పల్లవి॥)
మంచివాఁడ వౌదువయ్య మానిని అటుండఁగాను
మంచ మెక్కి చెలులతో మాఁట లేటి వయ్యా

(॥మంచివాడ॥)
కామిని నీవు రాఁగానె గక్కన లేచి నిలిచి
దోమతెరమాటు కేఁగి తొంగి చూచీని
కోమల మయినసతిఁ గూచుండు మనమయ్య
జా మాయ నప్పటినుండి చాలు నీ సరసము

(॥మంచివాడ॥)
తప్పక నీవు చూడఁగ తరుణి సిగ్గున నవ్వి
వొప్పుగాఁ దల వంచుక వూర కున్నది
ముప్పిరి నీచేత నాకెమో మెత్తి మాటాడవయ్య
యిప్పుడు డింతవడి యాయ నేఁటికీ సరసము

(॥మంచివాడ॥)
కొంగువట్టి తియ్యఁగాను కోమలి మేను మరచి
వుంగిటి నీ మేనిమీఁద నొర గున్నది
అంగవించి శ్రీవెంకటాదిప కూడితి విట్టె
చెంగట నలమేల్ మంగచేతి దీ సరసమూ

(||pallavi||)
maṁchivām̐ḍa vauduvayya mānini aḍuṁḍam̐gānu
maṁcha mĕkki sĕlulado mām̐ṭa leḍi vayyā

(||maṁchivāḍa||)
kāmini nīvu rām̐gānĕ gakkana lesi nilisi
domadĕramāḍu kem̐gi tŏṁgi sūsīni
komala mayinasadim̐ gūsuṁḍu manamayya
jā māya nappaḍinuṁḍi sālu nī sarasamu

(||maṁchivāḍa||)
tappaga nīvu sūḍam̐ga taruṇi sigguna navvi
vŏppugām̐ dala vaṁchuga vūra kunnadi
muppiri nīseda nāgĕmo mĕtti māḍāḍavayya
yippuḍu ḍiṁtavaḍi yāya nem̐ṭigī sarasamu

(||maṁchivāḍa||)
kŏṁguvaṭṭi tiyyam̐gānu komali menu marasi
vuṁgiḍi nī menimīm̐da nŏra gunnadi
aṁgaviṁchi śhrīvĕṁkaḍādiba kūḍidi viṭṭĕ
sĕṁgaḍa nalamel maṁgasedi dī sarasamū