మంచిముహూర్తమున శ్రీ మంతులిద్దరు
(॥పల్లవి॥)
మంచిముహూర్తమున శ్రీ మంతులిద్దరు
చంచులఁ బూవుదండలు చాతుకొనే రదివో
(॥మంచి॥)
సొరిదిఁ బేరటాండ్లు సోబానఁ బాడఁగాను
హరియు సిరియుఁ బెండ్లియాడేరదే
తొరలి యంతటా దేవదుందుభులు మొరయఁగ
గరిమ బాసికములు గట్టుకొనే రదివో
(॥మంచి॥)
మునులు మంగళాష్టకములు చదువుచుండఁగ
పెనగుచు సేసలు పెట్టేరదే
ఘనులు బ్రహ్మాదులు కట్నములు చదువఁగ
వొనరి పెండ్లిపీఁట పైనున్నారదివో
(॥మంచి॥)
అమరాంగనలెల్లాను ఆరతు లియ్యఁగాను
కొమరార విడే లందుకొనే రదివో
అమరి శ్రీ వేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
క్రమముతో వరములు గరుణించే రదివో
(||pallavi||)
maṁchimuhūrdamuna śhrī maṁtuliddaru
saṁchulam̐ būvudaṁḍalu sādugŏne radivo
(||maṁchi||)
sŏridim̐ beraḍāṁḍlu sobānam̐ bāḍam̐gānu
hariyu siriyum̐ bĕṁḍliyāḍerade
tŏrali yaṁtaḍā devaduṁdubhulu mŏrayam̐ga
garima bāsigamulu gaṭṭugŏne radivo
(||maṁchi||)
munulu maṁgaḽāṣhṭagamulu saduvusuṁḍam̐ga
pĕnagusu sesalu pĕṭṭerade
ghanulu brahmādulu kaṭnamulu saduvam̐ga
vŏnari pĕṁḍlibīm̐ṭa painunnāradivo
(||maṁchi||)
amarāṁganalĕllānu āradu liyyam̐gānu
kŏmarāra viḍe laṁdugŏne radivo
amari śhrī veṁkaḍeśhum̐ ḍalamelumaṁgam̐ gūḍi
kramamudo varamulu garuṇiṁche radivo